సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ‘‘కుబేర’ లాంటి మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకు ముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నగారు(ఏఎన్ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు.. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఆనంద్ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.
కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్ గారికి ఈ పాయింట్ మైండ్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఈ సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది. సినిమాలో నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. శేఖర్ నా క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పెర్ఫార్మన్స్‌కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయి.
ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు. ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్… అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్‌లో ఉంటాయి. సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబై, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్‌లో వర్క్ చేశాం. రష్మిక మందన్నా విషయానికి వస్తే.. తన క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు. పాన్ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలో కావడం లేదు కదా. కూలీలో డిఫరెంట్ కరెక్ట్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను’’ అని నాగార్జున తెలిపారు.
ప్రజావాణి చీదిరాల