రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం హైటెక్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు పదేళ్లుగా ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా అవార్డు కార్యక్రమం జరుగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి 2023 వరకూ ఉత్తమ చిత్రాలకు.. 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకూ గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమ, శ్రీముఖి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల