Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ అసుర హననం ఎలా ఉందంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుులు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆయన నటించిన ‘హరి హర వీరమల్లు’ విడుదలకు సిద్ధమైంది. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. పవన్ చారిత్రాత్మక యోధుడిగా ఈ సినిమాలో కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా ‘అసుర హననం’ విడుదలైంది. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగింది.

ఇక ‘అసుర హననం’ పాట విషయానికి వస్తే.. చూస్తున్నంత సూపూ గూస్‌బంప్స్ వస్తాయి. అసురులపై పోరాడుతున్న యోధుడి వీరత్వాన్ని హైలైట్ చేస్తూ పాట సాగుతుంది. కీరవాణి అందించిన సంగీతం పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ సంగీతానికి తగ్గట్టుగా గీత రచయిత రాంబాబు గోశాల.. తన పదునైన సాహిత్యంతో కట్టిపడేశారు. “భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం” వంటి పంక్తులు ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తాయి. గాయనీ గాయకులు ఐరా ఉడుపి, కాల భైరవ, సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ తమ గాత్రంతో గీతాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *