‘పుష్ప–2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో అల్లు అర్జున్ మరికొందరు టీమ్ సభ్యులు ప్రీమియర్ షోను చూడటం కోసం సంధ్య థియేటర్‌కి వెళ్లటంతో లెక్కకుమించి ప్రేక్షకులు హాజరవ్వటంతో తొక్కిసలాట జరిగింది.
ఆ సమయంలో అల్లు అర్జున్‌పై ఎంతో ప్రేమ ఉన్న వేలమంది అభిమానులు పాల్గొనటంతో జరగకూడని ఘోరం జరిగిపోయింది.
అల్లు అర్జున్‌కి ఇలాంటి ఉపద్రవం జరుగుతుందని ఊహిస్తే అక్కడికి వేళ్లేవారే కాదు కదా.
ప్రమాదం జరిగిన ప్లేస్‌లో అల్లు పాల్గొనటమే జరిగిన అనర్ధానికి కారణం అని పోలీసులు బన్నీని ముద్దాయిగా నిల్చోపెట్టారు.
శుక్రవారం రోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నామని చెప్పటంతో అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకోని వస్తాము అన్నా వినిపించుకోకుండా అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్ మర్డర్ చేశాడా? దొంగతనం చేశాడా? పారిపోవాలని చూశాడా? ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది?
అసలు అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న సమయంలోనే ఒక్కొక్కటిగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
కోర్టు అల్లు అర్జున్‌కు 14రోజుల రిమాండ్ విధించింది.
రిమాండ్ వార్త విన్న వెంటనే ఒక్కసారిగా అల్లు అర్జున్ కుటుంబసభ్యులు, తన ఫ్యాన్స్, తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 శాఖలు నివ్వెరపోయాయి.
శివమల్లాల
Also read this : అల్లుఅర్జున్ హైకోర్టు లో ఎమర్జెన్సీ పిటిషన్