...

అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిధి కోసం వెదుకుతున్న నాగ చైతన్య

‘తండేల్’ సక్సెస్‌తో అక్కినేని నాగ చైతన్య మాంచి జోష్ మీదున్నాడు. ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా ట్రెజర్ హంట్ మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ‘NC 24’గా ఈ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌ల‌పై బీవీఎస్ ఎన్‌ ప్ర‌సాద్, సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది.

ట్రెజర్ హంట్ కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక గుహ సెట్‌ను వేశారు. కార్తీక్ దండు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుని మరీ ఈ గుహ సెట్‌ను వేయించారట. ఇది చూడటానికి నిజంగానే గుహ మాదిరిగా అనిపిస్తోందని టాక్. సినిమాలో ఓ 20 నిమిషాల సన్నివేశాలు ఈ గుహలోనే ఉంటాయని సమాచారం. ఇవే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. నిధి అన్వేషణ నేపథ్యంలో గతంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. కొన్ని మంచి సక్సెస్ సాధించగా.. కొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. అసలే ‘తండేల్’ సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.