తెలుగువారి బాపు బొమ్మ అనగానే గుర్తుకువచ్చే పేరు ‘మిస్టర్ పెళ్లాం’ హీరోయిన్ ఆమనిగారు.
సెబాస్టియన్ బ్రదర్స్ అనే ఫోటోగ్రాఫర్స్ సరదాగా తీసిన ఫోటోలతో మంజుల అనే కన్నడ అమ్మాయి తమిళ హీరోయిన్ మీనాక్షిగా మారి
ఇళయరాజా గారి తమ్ముడు గంగై అమరన్ దర్శకత్వంలో ‘పుదియ కాట్రు’ సినిమాలో నటించారు.
కట్‌చేస్తే ఆమె నటించిన ఏ సినిమా విడుదల కాకముందే ప్రముఖ తెలుగు దర్శకులు ఈ.వి.వి సత్యనారాయణ గారు
‘జంబలకడిపంబ’ అనే చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఆమని అనే పేరు పెట్టారు.
ఆమని అంటే ప్రకృతి అని కూడా తెలియకుండానే తనపేరు ఆమనిగా మార్చుకున్నారామె.
కన్నడలో మంజులగా పుట్టి తమిళంలో మీనాక్షిగా మారి తెలుగు చిత్ర సీమకి ఆమని అయ్యారామె.
ఈవివిగారు, బాపుగారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారు, కె. విశ్వనాథ్ గారు, కె.రాఘవేంద్రరావుగారు వంటి దిగ్గజ దర్శకులతో పనిచేస్తూ ఏడాదికి 10 సినిమాల్లో నటించేవారామె.
అంతగా బిజిగా ఉన్న ఏ నటైనా పెళ్లికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు.
అటువంటిది సడెన్‌గా ఆమె పెళ్లి చేసుకుని బ్రేక్ తీసుకోవటం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
తర్వాత హరికృష్ణ హీరోగా నటించిన ‘స్వామి’, చంధ్రసిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ నలుగురు’ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారు ఆమని.
మళ్లీ బ్రేక్ కట్‌చేస్తే ఆమని తన మూడో ఇన్నింగ్స్‌లో మహేశ్‌బాబు, నాని, కార్తికేయ, రామ్, శర్వానంద్, అఖిల్‌వంటి యంగ్ హీరోలకు
మదర్‌గా, అక్కగా, వదినగా నటిస్తూ ఫుల్ బిజి అయ్యాను అంటూ నవ్వుతూ చెప్పారు.
టీవీ సీరియల్స్, వెబ్‌సిరీస్, సినిమాలు అనే తేడాలేకుండా ఫుల్ బిజి బిజీగా ఉన్నారామె.
ప్రస్తుతం సూర్య దర్శకత్వంలో శశి నిర్మించిన ‘నారీ’ సినిమాతో మార్చి 7న ప్రేక్షకులముందుకు వస్తున్నారామె.
ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూలో భాగంగా ఆమె తన వ్యక్తిగత విషయాలు, వృత్తిగత విషయాలను హ్యాపీగా షేర్ చేసుకున్నారు. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : తెలుగు, తమిళ, కన్నడ మిక్స్‌డ్ మసాలా మణికొండలో ఉంటుంది…
