అట్లూరి పూర్ణచంద్రరావు గారంటే తెలియని ఈ తరం సినిమా వాళ్లకి తెలిసేలా పాడ్‌కాస్ట్ చేస్తే దాదాపు 30 లక్షల నిమిషాలకు పైగా వ్యూవర్స్ చూసి ఆయన స్టోరిని తెలుసుకుని ఎంజాయ్ చేశారు. అయన బయోపిక్‌కి ఎంత క్రేజ్ ఉందో తెలిపే చిన్న ఉదంతం చెప్పాలని ఈ విషయం చెప్పాను. అలాగే అట్లూరిగారి పార్ట్–2లో ఏం కంటెంట్ ఉంటుందో అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూశారు. పార్ట్–2లో తన తండ్రి ఆయనకు చెప్పిన ఐదు జాగ్రత్తలు ఏంటి? అమితాబ్‌గారు, కమల్‌గార్ల ఈగో వల్ల ఆ రోజుల్లో దాదాపు 3.5 కోట్ల రూపాయలు పెట్టి తీసిన చిత్రాన్ని అరేబియా సముద్రంలో ఎందుకు కలిపారు? ఆ ఇద్దరి స్టార్ హీరోలు నిర్మాతను ఎందుకు ఇబ్బంది పెట్టారు? కృష్ణగారికి ఊటిలో సొంత ఇల్లు ఉంది. ఆ సమయంలో అనుకోకుండా బ్యాంక్‌లో క్యాష్ డ్రా చేయటానికి వచ్చిన కృష్ణగారిని కలిస్తే ఆయన ఏమన్నారు? నాగిరెడ్డి–చక్రపాణి అవార్డుకు నన్ను సెలక్ట్ చేసిన కమిటీ ఎలా తనను ఎన్నుకున్నారో? ఇలాంటి అనేక విశేషాలతో అట్లూరిగారి పాడ్‌కాస్ట్ రెండవ భాగం ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో విడుదలయింది. 90 ఏళ్ల వయసులో ఆయన ఎనర్జీని చూసి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు…అనిపించి మీ ముందుకు రెండవపార్టు కంటెంట్‌ను పెడుతున్నాం….ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This :కమర్షియల్ బ్లాక్‌బస్టర్ అనే మాటకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ దర్శకుడు…