...

పదేళ్ల తర్వాత తిరిగి మెగా ఫోన్ పట్టిన ఎస్‌జే సూర్య

మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పదేళ్ల విరామం తర్వాత తిరిగి మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం టైటిల్ ‘కిల్లర్’. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్‌జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషలలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గొకులం మూవీస్, ఈ సినిమాతో తమిళ సినీ రంగంలో కం బ్యాక్ ఇస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వి.సి.ప్రవీణ్, బైజు గోపాలన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కృష్ణమూర్తి వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ తాజాగా గ్రాండ్ గా జరిగింది. హీరో కార్తి మూవీ లాంచింగ్ ఈవెంట్‌కు హాజరైన టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. “కిల్లర్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయి సినిమా ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతిభ గల నటులు, సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రంగా రూపొందించబోతున్నాం ‘ అని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర తారాగణం, సాంకేతిక బృందం కథా నేపథ్యం వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించనున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.