ఇటీవలి కాలంలో గుండె పోటు మరణాలు బాగా పెరిగిపోతున్నాయి. పైగా వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. శుక్రవారం రాత్రి ‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్, నటి షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురైంది. ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను హుటాహుటిన అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే షఫాలీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే షఫాలీ మరణంపై కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
2005లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్తో షఫాలీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి షఫాలీని యూత్ ముద్దుగా ‘కాంటా లాగా గర్ల్’గా పిలవడం ప్రారంభించారు. అనంతరం సల్మాన్ ఖాన్ సినిమా ‘ముజ్సే షాదీ కరోగా’ చిత్రంలో నటించిది. అనంతరం షఫాలీ పలు టీవీ రియాలిటీ షోలు.. ఆపై హిందీ బిగ్బాస్ 13లోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే షఫాలీకి ఇన్స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. షఫాలీకి ఆకస్మిక మరణం గురించి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమెకు సంతాపం తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.