...

Hero Havish: రోజుకో సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది కానీ..

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘నేను రెడీ’. ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ‘నేను రెడీ’ మూవీ టైటిల్, గ్లింప్స్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. ‘‘నేను రెడీ మూవీ పక్కా ఎంటర్ టైనర్. హవీష్ లాంటి మంచి హీరోతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా డైరెక్టర్ త్రినాథరావు గారు ఈ మూవీని కంప్లీట్ ఫన్‌తో రూపొందించారు. ఈ రోజు మేము చూపించింది చిన్న గ్లింప్స్ మాత్రమే. మూవీలో మీకు కావాల్సినంత వినోదం ఉంది’’ అన్నారు.

హీరో హవీష్ మాట్లాడుతూ.. ‘‘ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. చాలా మంది నుంచి విశెస్ అందుకున్నా. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నువ్విలా, జీనియస్, సెవెన్ వంటి మూవీస్ తో నన్ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. వారి సపోర్ట్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. గ్యాప్ తీసుకోకుండా మూవీస్ చేయమని నా వెల్ విషర్స్ చెబుతుంటారు. నాకు ప్రతి రోజూ ఓ సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. కానీ లో క్వాలిటీ మూవీస్ చేయకూడదు. మంచి స్టాండర్డ్స్‌లో చేయాలనుకుంటా. మంచి అవకాశాలు రావాలని రోజూ కోరుకుంటా. త్రినాథరావు గారితో ఎప్పుడో మూవీ చేయాల్సింది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. నేను రెడీ మూవీతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను రెడీ బ్రిలియంట్ మూవీ, త్రినాథరావు గారి అన్ని మూవీస్ లో కల్లా ఈ సినిమాకే బెస్ట్ స్క్రిప్ట్ కుదిరిందని చెప్పగలను’’ అన్నారు.

ప్రొడ్యూసర్ నిఖిల కోనేరు మాట్లాడుతూ.. ‘‘నేను రెడీ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. మా నాన్నగారు జీనియస్, రాక్షసుడు వంటి సూపర్ హిట్ మూవీస్ చేశారు. విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లాలి అనేది నా డ్రీమ్. ఇప్పటికే నేను విద్యారంగంలో నాన్న లెగసీని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆ ప్రయత్నం ప్రారంభించాను. నా మొదటి చిత్రాన్ని త్రినాథరావు గారి లాంటి పెద్ద దర్శకుడితో ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్విస్తారు. ఆయన ఎక్సిపీరియన్స్ నుంచి ఎంతో నేర్చుకున్నాం’’ అన్నారు.

డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. ‘‘కుబేర సినిమా హిట్ కావడం ఇటీవల నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం. నెక్స్ట్ రాబోతున్న కన్నప్ప హిట్ కావాలి, ఆ తర్వాత వచ్చే పదీ పదిహేను సినిమాలు హిట్ కావాలి. థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడాలని కోరుకుంటున్నా. నేను రెడీ మూవీ గురించి చెప్పాలంటే… హవీష్ గారి ఫాదర్ నాకు బాగా పరిచయం. నేను వాళ్ల ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడిని. హవీష్ తో సినిమా చేయాలని అనుకుంటూ ఉన్నా. ఆయనకు కుదిరే మంచి కథ దొరికితే చేద్దామని అనుకున్నా. మజాకా కంప్లీట్ అయ్యాక రైటర్ విక్రాంత్ శ్రీనివాస్ ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. హవీష్ కు ఈ కథ బాగుంటుంది అనిపించి కథ చెప్పించాను. ఆయనకు వినగానే నచ్చి, ఈ సినిమా చేద్దామని అన్నారు. అలా నేను రెడీ టేకాఫ్ అయ్యింది. షూటింగ్ మొత్తం ఒక పండగలా చేస్తున్నా. పది సీన్స్ చేస్తే 8 సీన్స్ బాగా నవ్వుకుంటుంన్నాం. 2 సీన్స్ సెంటిమెంట్ తో ఉద్వేగానికి గురవుతున్నాం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్, కుటుంబం మధ్యలో ఉండే సరదాలు, ఎమోషన్స్ ..ఇవే మూవీలో ఆకట్టుకుంటాయి’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.