డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్.. మరికొందరి పేర్లు వెలుగులోకి?

డ్రగ్స్‌ కేసులో సినీ హీరో శ్రీరామ్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ను చెన్నై పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఏఐఏడీఎమ్‌కే మాజీ నేత ఒకరి నుంచి శ్రీరామ్‌ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వారు సైతం శ్రీరామ్ గురించి సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీరామ్‌ను నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. ఏఐఏడీఎమ్‌కే మాజీ నేత ప్రసాద్ చెన్నైలోని ఓ బార్‌లో తాగి గొడవకు దిగాడు. బార్ యజమానులు పోలీసులకు సమాచారం అందించగా.. అతడిని అరెస్ట్ చేశారు.

ప్రసాద్‌ను విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ప్రదీప్ అనే వ్యక్తి శ్రీరామ్ కోసం తన వద్ద కొకైన్ కొనుగోలు చేశాడని ప్రసాద్ వెల్లడించాడు. ప్రదీప్‌కు ఇప్పటి వరకూ మొత్తంగా 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్టు తెలియజేయడంతో పోలీసులు ప్రదీప్‌ను తీసుకుని విచారించారు. ప్రదీప్ ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందని సమాచారం. మరికొందరు తమిళ నటుల పేర్లు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక శ్రీరామ్ సినిమాల విషయానికి వస్తుే.. ‘రోజా కూటం’ అనేత తమిళ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తెలుగులో ‘ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *