Chiranjeevi-Anil Ravipudi: హలో మేడంగారూ.. ఏం ఎంట్రీ ఇచ్చారుగా..

చిరంజీవి- అనిల్‌ రావిపూడి ప్రాజెక్ట్‌ ‘మెగా 157’ లో హీరోయిన్ ఎవరనే విషయమై కొద్ది రోజుల క్రితం నుంచే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ బ్యూటీ కోసం ఫ్లైటెక్కి మరీ దర్శకుడు అనిల్ రావిపూడి చెన్నై వెళ్లారు. మొత్తానికి ప్రేక్షకులు మెచ్చిన హీరోయిన్‌ను ఫిక్స్ చేసుకుని వచ్చేశారు. వస్తూ వస్తూ ఊరికే వచ్చారా? ఓ వీడియోను కూడా తీసుకుని వచ్చారు. ఇవాళ ఆ వీడియోను విడుదల చేశారు. మొత్తానికి మేడంగారూ ఒక మెస్మరైజింగ్ వీడియోతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆ బ్యూటీ మరెవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార. ఆమె ఎంట్రీ వేరే లెవల్.

కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా ప్రి పొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత నయన్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో విక్టరీ వెంకటేశ్ నటించనున్నారని టాక్. ఇక చిరంజీవి ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *