మంచు మనోజ్ చాలా కాలం తర్వాత తిరిగి ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నాడు. అయితే ఆయన హీరోగా చేసిన సినిమాలైతే ఇటీవలి కాలంలో లేవనే చెప్పాలి. ఇక తాజాగా దర్శకుడు శేఖర్ రెడ్డికి మంచు మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే శేఖర్ రెడ్డి తీసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో మనోజ్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆయన గతంలో తీసిన ‘90 ఎంఎల్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇక ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా తీస్తే అది ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా తెలియలేదు.
అలాంటి దర్శకుడికి మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకు టైటిల్‌తో పాటు లాంచ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. ‘అత్తరు సాయిబు’ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా మే 20న మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుందట. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్టు సమాచారం. అలాగే సినిమాలో మనోజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాడట. బాడీ లాంగ్వేజ్‌తో పాటు డిఫరెంట్ మ్యానరిజంతో అలరిస్తాడని టాక్. మొత్తానికి ‘అత్తరు సాయిబు’ అయితే ముస్తాబవుతున్నాడట..