ప్రస్తుతం రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబో ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోతో అంచనాలే మారిపోయాయి. ఎప్పుడూ వినని సరికొత్త కథతో ఈ సినిమా రూపొందనుందని గ్లింప్స్ ద్వారా తెలిసింది. అయితే సినిమాలో హఈరో అల్లు అర్జున్ మినహా ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్స్ ముగ్గురని తెలుస్తోంది కానీ ఆ ముగ్గురూ ఎవరనేది మాత్రం తెలియడం లేదు. దీంతో రోజుకో పేరు బయటకు వస్తోంది. ఇప్పటికే లిస్ట్‌లో సమంత, దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, శ్రద్ధా కపూర్, అనన్య పాండే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌కు మరో పేరు కూడా యాడ్ అయ్యింది. ఆమె మరెవరో కాదు.. శ్రీనిధి శెట్టి. అసలు వీరిలో ఎవరుంటారో.. ఎవరు ఉండరో కూడా తెలియడం లేదు. ‘శుభం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. సమంతను అల్లు అర్జున్, అట్లీ కాంబోలో నటిస్తున్నారా? అని అడిగితే.. తనకు అట్లీ మంచి ఫ్రెండ్ అని.. అయితే తన వద్దకు ప్రపోజల్ ఏమీ రాలేదని తెలిపింది. ఒకవేళ వస్తే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదు పేర్లు కాస్తా.. శ్రీనిధి జాయిన్ అవడంతో ఆరు అయిపోయాయి. మరి మేకర్స్ డీటైల్స్ అన్నీ వెల్లడించే సమయానికి ఈ లిస్ట్ ఎంతకు చేరుతుందో చూడాలి.