...

ది అన్‌టోల్డ్ స్టోరీ….

కొన్ని కథల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే నాకు తెలిసిన కొంత చెప్పాను. మీరు కూడా ఓసారి 35 ఏళ్ళ క్రితం రాంచరణ్ నాన్న చిరంజీవి, కేఎస్ ప్రకాష్ నాన్న కె.రాఘవేంద్రరావు బి.ఏ , జాన్వీ కపూర్ అమ్మ శ్రీదేవిగారు, యువన్ శంకర్ రాజా నాన్న ఇళయరాజా, ప్రభు దేవా నాన్న సుందరం గారు, ఆనంద్ సాయి నాన్న బి.చలం గారు, అజయన్ విన్సెంట్ నాన్న విన్సెంట్ గారు,స్వప్న దత్-ప్రియాంక దత్ నాన్న అశ్విని దత్ చేసిన మ్యాజిక్ మరోసారి స్క్రీన్ మీదకు వస్తుంది. ఎందుకు వాళ్ల నాన్న లు అంటున్నాను అంటే ఈ జనరేషన్లో కూడా ఆ సినిమా చేసిన కుటుంబమంతా ఇదే చిత్ర పరిశ్రమలో అహర్నిశలు శ్రమించి కష్టపడి ఇంకా ఇంకా ఏదో సాధించాలని చిన్న పిల్లల్లా కలలు కంటున్నారు. అందుకే జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి అద్భుతం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వారందరూ వారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇండస్ట్రీ కి తీసుకు వచ్చి ప్రేక్షకులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించారు. ఇండస్ట్రీ కి ఎంతో సేవ చేసిన చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ జనరేషన్ కూడా 35 సంవత్సరాల క్రితం వారు చేసిన అద్భుతాన్ని మరో సారి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ వారిగురించి ఆ సినిమా సాధించిన విజయం గురించి కలెక్షన్ల సునామీ గురించి అవార్డుల గురించి ప్రత్యేకంగా ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది. కంటెంట్ బై శివ మల్లాల

Jagadekaverudu Athiloka sundari
Jagadekaverudu Athiloka sundari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.