...

Shubham Movie Review: అంతా ‘శుభ’మేనా?

విడుదల తేది– 09.05.2025
నటీనటులు– సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి, ఆర్య,మధు మణి , వంశీధర్ గౌడ్ తదితరులు
ఎడిటర్‌– ధర్మేంద్ర కాకరాల
సంగీతం– సింటన్ సెర్జియో
నిర్మాత– సమంత
దర్శకత్వం– ప్రవీణ్ కండ్రేగుల
కథ– వసంత్ మారిగంటి
సినిమాటోగ్రఫీ – మృదుల్ సేన్

ఇన్నాళ్లూ ఒక అద్భుతమైన నటిగా అలరించిన సమంత.. తొలిసారిగా నిర్మాతగా మారి ‘శుభం’ సినిమాను తెరకెక్కించింది. సమంత సినిమా అంటే అంచనాలకు ఏమాత్రం కొదువ ఉండదు. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? చూద్దాం.

కొన్ని కథలు కాలానుగుణంగా తయారవుతాయి. ప్రత్యేకించి ఇలాంటి కథలకు మలయాళం సినిమా పరిశ్రమ పెట్టింది పేరు. ఒక చిన్న లైన్తో కథ రాసుకుని దాని చుట్టూ తిరిగే కథ ఈ సినిమా. ముఖ్యంగా ఇటువంటి కథ రాయాలంటే తీయాలంటే దర్శకునికి మంచి టేస్ట్ ఉండాలి. అలాంటి టేస్ట్ ఉన్న సినిమా నే “ శుభం ‘. ప్రముఖ హీరోయిన్ సమంత తొలిసారి నిర్మాతగా మారి “సినిమా బండి ‘ సినిమా కి దర్శకత్వం వహించిన ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. సమంత చాలాకాలం తరువాత తెలుగులో చిన్న కేమియో రోల్ లో నటించటంతో సినిమాకు అంచనాలు పెరిగాయి. న్యూ ఏజ్ నటులు హర్షిత్ రెడ్డి, గవి రెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి,షాలిని కొండేపూడి వంటి నటులు ఫుల్ ఎనర్జీ తో నటించిన ఈ చిత్రం ఎలా ఉంది ? ధియేటర్లో ఈ సినిమా స్పందన ఎలా ఉంది అంటే…..

మూడు నవ్వులు ఆరు భయాలు అన్నట్లుగా ఈ సినిమా ఉంది. ముఖ్యంగా వేరు ఎన్నుకొన్న కథకు తగ్గ కథనంతో సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. చిన్న ఊర్లో కేబుల్ టీవీ పెట్టుకుని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసే కుర్రాడు హర్షిత్ కి పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ పెళ్లి తరువాత భార్య తో ఎలా ఉండాలి? భర్త ల రేంజ్ ఏ రేంజ్ లో ఉండాలి అని హర్షిత్ కి తన స్నేహితులు ఆల్ఫా మేల్ జాతి మగవాళ్ళు గవిరెడ్డి, చరణ్ లు నూరి పోస్తారు. హర్షిత్ ని పెళ్లి చేసుకుని వచ్చిన శ్రియ చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్న మంచి గడసరి అమ్మాయి. మొదటిరాత్రి రోజు వారిద్దరి మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి? అనే పాయింట్ నుండి సినిమా స్పీడ్ అందుకుంటుంది. అక్కడనుండి ఏం జరుగుతుంది? అనేది సినిమా థియేటర్ లోన్ చూడాలి. సమంత ఎప్పడు వస్తుంది ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉన్న కరెక్ట్ సమయంలో ఆమె ఎంట్రీ ఉంటుంది. ఆడియన్స్ కి మంచి సర్ప్రైస్ ఇచ్చిన సమంత చాలా తక్కువ సమయం ఉన్నా కూడా ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకం.

నటీనటుల పనితీరు: సమంత చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. సినిమాలో ఒకటీ అర తప్ప అన్నీ కొత్త మొహాలే. మెయిన్ హీరోగా నటించిన హర్షిత్ రెడ్డి, హీరోయిన్ శ్రీయ కొంతం తమ పాత్రలకు చక్కగానే న్యాయం చేశారు. మిగిలిన వారు గవిరెడ్డి, చరణ్ పేరి వారి భార్యలుగా శాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీరందరినీ చూస్తుంటే మన పక్కింటి వారినో.. ఎదురింటి వారినో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.

టెక్నికల్‌ విభాగం: సినిమాలో పాటలతో దర్శకుడు ఏమీ హడావుడి చేయలేదు. చేసినంత వరకూ క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథకు తగినట్టుగా ఉన్నాయి. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల సింపుల్ పాయింట్‌తో కథ రాసుకుని ఒక మెసేజ్‌ను బాగానే అందించాడు.

ప్లస్‌ పాయింట్స్‌: నటీనటుల పని తీరు, కథ, ఇంట్రెస్టింగ్ నెరేషన్, నేచురల్ లొకేషన్స్

మైనస్‌ పాయింట్స్‌: సింగల్ పాయింట్ చుట్టూ తిరిగే కథ, సాగదీత

ఫైనల్‌ వర్డిక్ట్‌: ఎక్కువ ఊహించుకోకపోతో ఫ్యామిలీ తో హ్యాపీ గా ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్‌– 3/5

శివమల్లాల

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.