...

అప్పుడు షోతో వివాదం.. ఇప్పుడు నటిపై అత్యాచారం.. అసలు ఎవరీ అజాజ్ ఖాన్?

సినిమా ఇండస్ట్రీ ఒక లగ్జరీ ప్రపంచం. కొందరు ఫీల్డ్ వదిలేసినా ఎలాగోలా బతికేస్తారు కానీ లగ్జరీకి అలవాటు పడిన వారు బయటకు వచ్చి ఏదైనా పని చేసుకుని బతకడం అసాధ్యం. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించేందుకే యత్నిస్తారు. అజాజ్ ఖాన్ కూడా ఒకరకంగా ఈ కోవకు చెందిన వాడే. వారం రోజులుగా ఇతనో హాట్ టాపిక్. ఎందుకంటే.. ఈయన డర్టీ వెబ్ సిరీస్‌లకు కేరాఫ్ అయిన ‘ఉల్లు’ కోసం రూపొందించిన అడల్ట్ షో ‘హౌస్ అరెస్ట్’కు హోస్టింగ్ చేస్తున్నాడు. దీని సంగతి కాసేపు పక్కన పెడితే.. అజాజ్.. ఓ నటికి అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేశాడట. ఆమె ఫిర్యాదుతో అజాజ్ పేరు హాట్ టాపిక్‌గా మారింది.

అహ్మదాబాద్‌కు చెందిన అజాజ్‌ఖాన్‌కు ఎలాంటి సినీ నేపథ్యమూ లేదు. నటనపై ఆసక్తితో నానా తంటాలు పడి ‘పాత్’ సినిమాలో అవకాశం సంపాదించాడు. ఆ తరువాత ఏక్తాకపూర్ నిర్మించిన ‘క్యా హోగా నిమ్మో కా’తో బుల్లితెరపై కూడా అడుగు పెట్టి ఆ తర్వాత ‘బాలీవుడ్ క్లబ్’ షో విజేతగా నిలిచాడు. బాలీవుడ్ ‘బిగ్‌బాస్ 7’లో రన్నరప్‌గా నిలిచారు. ఆ తరువాత అవకాశాలు తగ్గాయో.. లేదంటే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామన్నారో కానీ ‘హౌస్ అరెస్ట్’కు హోస్టింగ్ చేసి కావల్సినంత నెగిటివిటీని మూట కట్టుకున్నాడు. చివరకు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ షోను బ్యాన్ చేసింది. తెలుగులో ‘రక్త చరిత్ర 2’, ‘దూకుడు’, ‘నాయక్’, ‘బాద్‌షా’ తదితర చిత్రాల్లో నటించాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.