ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ 46 వ మ్యాచ్ ఢిల్లీ మరియు బెంగళూరు జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన రాయల్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ ఓపెనర్స్ అభిషేక్ పొరల్ 11 బంతుల్లో 28 పరుగులు (2 ఫోర్లు 2 సిక్సర్స్), డూప్లే సెస్ 26 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేయటంతో స్కోర్ బోర్డు అస్ స్లో అయింది. కేఎల్ రాహుల్ 39 బంతుల్లో 41 పరుగులు ( 3 ఫోర్లు) ,స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు (5 ఫోర్స్,సిక్సర్) సాయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ 3 వికెట్స్, హేజిల్ వుడ్ 2 వికెట్లు, కృనాల్ పాండ్యా, యాష్ దయాల్ ఒక్కో వికెట్ తీసి ఢిల్లీ జట్టును కట్టడి చేశారు.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు కి పవర్ ప్లే లోనే చుక్కెదురైంది. 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్కడినుండి బెంగళూరు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిని కృణాల్ పాండ్యతో కలిసి విరాట్ కోహ్లీ మొదలెట్టాడు. 47 బంతుల్లో 51 పరుగులు ( 4 ఫోర్లు) చేసి విజయానికి మరో 13 పరుగులు అవసరం ఉండగా సిక్స్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. కృణాల్ అల్ రౌండ్ ప్రతిభతో 47 బంతుల్లో 73 పరుగులు ( 5 ఫోర్లు 4 సిక్సర్లు) చేసి బెంగళూరు టీమ్ ను విజయ తీరాలకు చేర్చాడు. ఢిల్లీ కెప్టెన్ అక్సర్ పటేల్ ఒక్కడే 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి కట్టు దిట్టంగా బౌలింగ్ చేశాడు. వరుసగా హాఫ్ సెంచరీలు చేస్తూ టీమ్ ని గెలుపు బాటలో పయనిస్తున్న విరాట్ కోహ్లీ ని టీమ్ తో పాటు ఫాన్స్ అభినందిస్తున్నారు. కృణాల్ పాండ్యా కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలోకి వచ్చి నిలిచింది బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు.
శివ మల్లాల