ఇటీవలి కాలంలో వరుస విజయాలతో మాంచి జోష్ మీదున్నాడు ప్రియదర్శి. ప్రస్తుతం ‘సారంగపాణి జాతకం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రూపా కొడవాయూర్ హీరోయిన్గా నటించింది. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను గట్టిగానే చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మూవీ కథ ఏంటనేది ఈ పాట ద్వారా మేకర్స్ తెలిపారు. ‘సారంగపాణి జాతకం’ థీమ్ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
‘‘తెల్లా తెల్లారినాదో ఊరుకోదు కన్ను.. చూడాలెగాని చుట్టూ బోలెడంత ఫన్ను.. తెల్లా తెల్లారినాదో ఊరుకోదు కన్ను.. ఏదోటి చూస్తానే ఉంటది.. చూడాలెగాని చుట్టూ బోలెడంత ఫన్ను.. వద్దన్నా కంటపడతనంటది.. ఎవ్రిడే కష్టమూ నష్టమూ సోది’’ అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ థీమ్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా… వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్‌కు రామ్ మిర్యాల గాత్రం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ ఒక్క పాటతో సినిమా ఎలా ఉంటుందో చెప్పేవారు. ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, నరేష్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.