తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు అశోక్ తేజ రూపొందించిన ఈ చిత్రంలో తమన్నా శివశక్తిగా నటించింది. ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం మేకర్స్ సినిమా ట్రైలర్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ట్రైలర్ను బట్టి చూస్తే.. దుష్టశక్తుల నుంచి ఓదెల గ్రామాన్ని మల్లన్న స్వామి ఎలా రక్షించాడనేది ప్రధానాంశం. డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓదెల అనే ఊరిలో ప్రేతాత్మల కారణంగా జనం ఇబ్బంది పడుతుంటారు. వారిని రక్షించేందుకు కాశీ నుంచి శివశక్తి ఓదెలకు వస్తుంది. ఆ తరువాత ప్రేతాత్మల ఆటను ఎలా అరికట్టిందనేది చిత్ర కథాంశం. ‘గరళ కంఠుడినై విషాన్ని మింగేస్తా’ అంటూ తమన్నా చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందనేది ట్రైలర్లో మేకర్స్ చూపించారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా సినిమా బాగుంది. తొలి భాగంలో నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహలకు సీక్వెల్లోనూ మంచి పాత్రలు లభించాయి.
ప్రజావాణి చీదిరాల