రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్‌లో చెర్రీ సిక్సర్ బాదితే.. ఈ వీడియో రికార్డ్ స్థాయిలో దూసుకెళుతోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. కేవలం 24 గంటల్లో 36.5 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళుతోంది. ఇప్పటి వరకూ ‘దేవర’, ‘పుష్ప 2’ గ్లింప్స్ వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్నాయి. వీటిని ‘పెద్ది’ దాటేసింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ పండుగు చేసుకుంటున్నారు.
టాప్ 5 చిత్రాల గ్లింప్స్‌కి సంబంధించిన వ్యూస్‌ను పరిశీలిస్తే ..
పెద్ది – 36.5 మిలియన్లు
దేవర – 26.17 మిలియన్లు
గుంటూరు కారం – 20.98 మిలియన్లు
పుష్ప2 : 20.45 మిలియన్లు
ది ప్యారడైజ్: 17.12 మిలియన్లు
గ్లింప్స్‌లో రామ్ చరణ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే చెర్రీ కొట్టిన షాట్ ప్రధాన ఆకర్షణ. పిరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రజావాణి చీదిరాల