రామం రాఘవం రివ్యూ….

రివ్యూ : రామం రాఘవం

విడుదల తేది :  21–02–2025

నటీనటులు : సముద్రఖని, ధన్‌రాజ్‌ కొరనాని, సునీల్, సత్య, హరీశ్‌ ఉత్తమన్, ప్రమోదిని, పృధ్వీ తదితరులు

ఎడిటర్‌ : మార్తాండ్‌ కె.వెంకటేశ్‌

సినిమాటోగ్రఫీ : దుర్గాప్రసాద్‌

సంగీతం : అరుణ్‌ చిలివేరు

సమర్పణ : ప్రభాకర్‌ అరిపాక

నిర్మాత : ప్రృధ్వీ పోలవరపు

దర్శకత్వం : ధన్‌రాజ్‌

కథ :

రామం (సముద్రఖని) రిజిస్టార్‌ ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగి. చాలా సిన్సియర్‌గా డ్యూటీ చేస్తారు.

ఆయనకు ఒక్కగానొక్క కొడుకు రాఘవ (ధన్‌రాజ్‌).

పెళ్లిచేసుకుంటే వచ్చే కట్నం డబ్బుతో లైఫ్‌ సెటిల్‌ అవుతుందిలే అనుకునే మైండ్‌సెట్‌తో ఉండే పనిపాట లేకుండా ఊర్లో తిరిగే జులాయి.

సినిమా ప్రారంభంలోనే తన కొడుకుకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని చెడగొడతాడు రామం.

మా అబ్బాయి గురించి వేరే ఎవరో చెప్తే మీరు నమ్మకూడదు కానీ, సొంత తండ్రినే చెప్తున్నాను.

మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి సుఖపడదని అని పెళ్లికూతురు తండ్రితో రామం చెప్పే మాటలివి.

ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్‌ కంటెంట్‌తో వచ్చిన ‘రామం రాఘవం’ సినిమా కథ పరంగా ఇంతకంటే చెప్పుకుంటే థియేటర్‌లో సినిమా చూసే ప్రేక్షకునికి కిక్‌ ఉండదు.

అందుకే మిగతా కథని థియేటర్‌లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

సముద్రఖని ఎంతో మంచి నటుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కానీ రామం పాత్రలో ఆయన చూపించిన నటనకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

అంత కన్విన్సింగ్‌తో తన క్యారెక్టర్‌లో నటించారు సముద్రఖని. ఏ తండ్రికైనా కొడుకుపై అంతటి మమకారం ఉంటుంది.

తండ్రి అయిన ప్రతి ఒక్క మగాడికి ఆ బిడ్డలపై మమకారం ఉంటుంది.

మంచితనం సముద్రమంత ఉండే తండ్రిపాత్రలో అలవోకగా నటించి రామం పాత్రకు నిండుతనాన్ని తీసుకొచ్చారు సముద్రఖని.

అలాగే కొడుకు పాత్రలో రాఘవగా నటించిన ధన్‌రాజ్‌ నటన మరో లెవెల్లో ఉంటుంది.

కొన్ని సీన్లలో ధన్‌రాజ్‌ నటన చూసినప్పుడు ఇతను నిజంగా మారిపోయాడేమో అన్నట్లుగా తన నటన ఉంటుంది.

ఇద్దరి నటనలో పూర్తిస్థాయి మెచ్యూరిటీ ఉంటుంది.

తల్లి పాత్రలో నటించిన కమలమ్మ పాత్రకు (ప్రమోదిని) ఈ సినిమాలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

ముఖ్యంగా తండ్రి, కొడుకుల మధ్య నలిగిపోయో తల్లిగా, ఇల్లాలిగా చక్కగా నటించారామె.

కొడుకు ఎలాంటివాడైనా కాపాడుకోవాలి అనే తత్వంతో పాటు భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలి అనే పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు.

మిగతా పాత్రల్లో స్నేహితునిగా నటించిన సత్య, హరీషోత్తమన్‌ పాత్రలతో పాటు ఫైనాన్షియర్‌ పాత్రలో సునీల్‌ ఇరగదీశాడు. కొన్ని పాత్రలు పరవాలేదనిపించాయి.

టెక్నికల్‌ విభాగం :

టెక్నికల్‌గా ఈ సినిమా చాలా సౌండ్‌ చేస్తుంది. కారణం ఈ సినిమాలోని కథాబలం ఆ రేంజ్‌లో ఉంటుంది.

కథను అందించిన ‘విమానం’ చిత్ర దర్శకుడు శివప్రసాద్‌ యానాలతో మొదలుకొని సంగీతాన్ని అందించిన అరుణ్‌ వరకు ప్రతి ఒక్కరికి చాలా మంచి పేరు వస్తుంది.

కెమెరామెన్‌ దుర్గాప్రసాద్‌ ఫ్రేమ్స్‌ కూడా కథకు ఉపయోగపడేలా ఉంటుందే తప్ప పెద్ద హంగులు ఆర్భాటాలు ఏమి ఉండవు.

కథను ముందుకు తీసుకెళ్లేలా ప్రతి టెక్నిషియన్‌ పనితనం ఉంటుంది.

ముఖ్యంగా ఇటువంటి సినిమాలకు ఎడిటర్‌ ఎంత ప్రధానమో మార్తండ్‌. కె. వెంకటేశ్‌ ఎడిట్‌ను చూస్తే తెలుస్తుంది.

సినిమాకి ఆయన ఎంతగానో హెల్ప్‌ అయ్యారనిపించింది.

ఏ స్టార్‌ లేకుండా కంటెంటే నా సినిమాలో స్టార్‌ అని నమ్మి సినిమాను రెండు భాషల్లో నిర్మించిన స్లేట్‌ పెన్సిల్‌ ప్రొడక్షన్స్‌ ప్రభాకర్,

పృద్వీ తొలి సినిమానే ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు అనే పురు తెచ్చుకుంటారు.

ప్లస్‌ పాయింట్స్‌ :

కంటెంట్‌ ఉన్న కథకి మాటలు ప్లస్‌
రామంగా సముద్రఖని నటన
ధన్‌రాజ్‌ దర్శకత్వం

మైనస్‌ పాయింట్స్‌ :

ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి కొడుకులు తయారయితే సమాజానికి ఎంతో నష్టం.
కమెడియన్‌ దర్శకత్వంలో ఇంత ఎమోషనా…
కొన్ని పాత సినిమాలు గుర్తుకు రావొచ్చు, వస్తాయి.

ఫైనల్‌ వర్డిక్ట్‌ :

కంటెంట్‌ఫుల్‌ తెలుగు సినిమా డోంట్‌ మిస్‌..

రేటింగ్‌ : 3.25/5
శివమల్లాల

Also Read This : క్యాన్సర్‌ ఫోర్త్‌ స్టేజ్‌..నేను ఏం చేయగలను– దర్శకుడు ధన్‌రాజ్‌ కొరనాని

Ramam Raghavam Review
Ramam Raghavam Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *