Namratha Shirodkar :
నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబులాంటి స్టార్ వైఫే కాదు…షి ఈజ్ ఎ స్టార్ హర్ సెల్ఫ్ ఆల్సో.
ఎందుకు ఇప్పుడు ఆమె గురించి అంటే జనవరి 22 ఆమె పుట్టినరోజు.
ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ జనరేషన్‌లోని ప్రతి ఒక్కరూ నమ్రతా అనగానే
మహేశ్‌బాబు వైఫ్ అనో సితార మదర్ అనో కృష్ణగారి కోడలు అనో అనుకుంటున్నారు.
కానీ మహేశ్‌ని పెళ్లి చేసుకోకముందు అంటే 1993లోనే ఆమె చాలా ఫేమస్.
అందుకే ఆమె గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు మీ కోసం ట్యాగ్‌తెలుగు అందిస్తుంది..
నమ్రత గ్రాండ్‌మదర్ మీనాక్షి శిరోద్కర్ 1940ల్లోనే మరాఠి సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.
అప్పటినుండి నమ్రత కుటుంబానికి సినిమా వాసన ఉంది. వారు కుటుంబం తొలుత గోవాలో నివసించేవారు.
తర్వాత కాలంలో ముంబైకి మారటంతో మరఠా వాసులుగా స్థిరపడ్డారు.
అందుకే ఇప్పటికి నమ్రతతో పాటు కూతురు సితారకూడా మరఠా మాట్లాడుతుంది.
నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కూడా ప్రముఖ నటే. ఆమె అనేక బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.
దాదాపు 50 సినిమాలకు పైగా నటించిన శిల్పా తెలుగులో మోహన్‌బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
నమ్రతాకంటే రెండేళ్లు చిన్నదైన శిల్పా 1989లోనే బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది.
కానీ నమ్రత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకోవటానికి 1999 వరకు ఆగల్సి వచ్చింది.
నమ్రతా తనకు 21 ఏళ్ల వయసున్నప్పుడు మోడల్‌గా ఫెమినా మిస్ ఇండియా 1993 కిరీటాన్ని కైవసం చేసుకుని ప్రముఖ మోడల్‌గానే కాకుండా నటిగా స్తిరపడ్డారు.
ముఖ్యంగా అనేక బాలీవుడ్ సినిమాల్లో లీడ్ పాత్రల్లో నటించారు నమ్రతా.
అంటే 1998 నుండి 2005లో ఆమెకు పెళ్లయ్యే వరకు దాదాపు 25 సినిమాల్లో నటించారామె.
ఆ సమయంలో బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, సునీల్‌శెట్టి, సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవ్‌గన్‌లతో పాటు
మలయాళ నటుడు మమ్ముట్టితోను తెలుగులో మహేశ్‌బాబుతో ‘వంశీ’, చిరంజీవితో ‘అంజి’ సినిమాల్లో నటించారు.
2000 సంవత్సరంలో బి.గోపాల్ దర్శకత్వం వహించిన ‘వంశీ’ చిత్రంలో మహేశ్‌బాబుతో కలిసి నటించటంతో మహేశ్‌తో పరిచయం ఏర్పడింది.
ఆ సినిమా తర్వాత వారిద్దరూ నాలుగేళ్లపాటు ప్రేమలో ఉండి 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు.
ఇద్దరి వివాహం కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఐదేళ్లలో తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ మొత్తం పూర్తి చేసుకుని పెళ్లి చేసుకున్నారు నమ్రత.
పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా కెమెరా ముందుకు రాకుండా అలా ఉండిపోయారు నమ్రత.
అందరూ మహేశను ఫ్యామిలీమ్యాన్ అంటారు కానీ అసలు సిసలు ఫ్యామిలీఉమెన్ నమ్రతానే అంటుంటారు.
ఆమె గురించి తెలిసిన ఎవరైనా. వారద్దరికి గౌతమ్, సితార అని తెలుసుకదా.
పెళ్లి తర్వాత మహేశ్‌బాబు వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసూకునేవారామె.
పిల్లలు, భర్త, ఇంటి వ్యవహారాలు చూసుకోవటమే కాకుండా అనేక రకాలైన బిజినెస్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చారు నమ్రత.
ఇప్పుడు తన వారసులు కూడా త్వరలోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తారని
మహేశ్‌బాబు ఫ్యాన్స్‌తో పాటు సితార ఇన్‌స్టా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.
దానికి తగినట్లుగానే ఆమె ప్లానింగ్ ఉంటుందని అనుకుంటున్నారు.
నమ్రత మహేశ్‌బాబు కంటే మూడేళ్ల ఏడు నెలలు పెద్ద వయసు అంటే నమ్మలేనట్లుగా ఉంటారు.
స్వతహాగా మోడల్ కావటంతో ఆమె తన ఫిజిక్‌ను అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు.
53 సంవత్సరాలు పూర్తి చేసుకుని 54లోకి ఎంట్రీ ఇస్తున్న నమ్రతకు హ్యాపి బర్త్‌డే నమ్రత అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్
శివమల్లాల
Also Read This : ఆనంద చక్రపాణికి వందకు వంద మార్కులు…
