టాలీవుడ్ ప్రొ లీగ్ ఎప్పడు స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఆడతారు ..టీమ్ ఓనర్స్ ఎవరు ? టాలీవుడ్లోని 24 శాఖలు పాల్గొనే ఈ క్రికెట్ లీగ్ లో ప్రైజ్ మనీ ఎంత… ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు తెలంగాణ ఎఫ్డీసి చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు. రాజు గారితో టీపీఎల్ మ్యాచులలో పాల్గొనే 6 మంది ఆటగాళ్లతో స్పెషల్ చిట్ చాట్ చేశారాయన. మరో రెండు రోజుల్లో రాబోయే ఆ వీడియో ప్రోమో ఇప్పుడు మీరు చూస్తున్నారు. రాజుగారితో ఇంటర్వ్యూ లో పాల్గొన్నవారిలో టీపీఎల్ ప్రతినిధి వంశీ చాగంటి, దర్శకులు శైలేష్ కొలను, యదు వంశీ, సింగర్ రేవంత్ , ఆర్టిస్ట్ లు చైతన్యరావు, విష్ణు ఉన్నారు.