“ఆకాశంలో ఒక తార” కథకు నేను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను

ఆకాశంలో ఒక తార సినిమా కథకు తాను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయ్యానని చెప్పారు హీరోయిన్ రుహానీ శర్మ. ఈ చిత్రంలో ఆమె బిజిలీ అనే పాత్రలో నటిస్తన్నారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా ఆధ్వర్యంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించగా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పిస్తున్నారు. ఈ నెల 20 ఆకాశంలో ఒకతార సినిమా రిలీజ్ కు రాబోతోంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రుహానీ శర్మ స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

హీరోయిన్ రుహానీ శర్మ మాట్లాడుతూ : ఆకాశంలో ఒక తార సినిమా కథకు నేను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను. ఈ కథలో అమ్మాయిలాగే నేను కూడా హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఊరి నుంచి వచ్చాను. నేను హీరోయిన్ గా మారి ఇలాంటి వేదిక మీద నిలబడి మాట్లాడతానని ఎవరైనా అప్పుడు చెప్పి ఉంటే నమ్మేదాన్ని కాదు. పరిస్థితుల కారణంగా మన కలల్ని చిన్నవి చేసుకోకూడదు. ఈ చిత్రంలో బిజిలీ అనే పాత్రలో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్ ను చాలా ఇష్టపడి చేశాను. క్యారెక్టర్ నిడివి ఎంత ఉంది అనేకంటే ఆ పాత్ర కథలో ఎంత కీలకంగా ఉందనేది చూసుకుంటాను. అందుకే ఈ రోల్ చేశాను. మీరంతా మా మూవీని, నా పర్ ఫార్మెన్స్ ను ఇష్టపడతారని నమ్ముతున్నాను. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *