ఈ నెల 8వ తేదీన విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి” ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “రణబాలి” సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 8వ తేదీన ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. “రణబాలి” ట్రైలర్ పై మూవీ లవర్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ రాగా…విజయ్, రశ్మిక చేస్తున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ వైరల్ గా మారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ట్రైలర్ తో “రణబాలి” సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడనుంది.

19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *