డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కు రాబోతున్న మూవీ “ఇడుపు కాయితం”

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

“ఇడుపు కాయితం” సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో మరే చిత్రానికీ లేనంతగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. “ఇడుపు కాయితం” త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో దర్శక నిర్మాతలు షేర్ చేసుకోనున్నారు.

 

నటీనటులు – ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *