ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఆగస్టులో ఈ చిత్రాన్ని ఘనంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫుల్ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. ఈ కథ తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధాన్ని హైలైట్ చేస్తూ యాక్షన్ ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ ఆంటోని కనిపిస్తున్న తీరు, రక్తంతో ఉన్న ఆ విధానం, ఆయన ఇంటెన్స్ లుక్స్ ఇవన్నీ కథ ఎంత డెప్త్‌గా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. ఎ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు.
యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం రానుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన, భావోద్వేగభరితమైన, మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది.
తారాగణం: విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు