వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సోమేష్ నిర్మాతగా శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రానున్న చిత్రం ఆత్మ కథ – యాన్ అన్ టోల్డ్ స్టోరీ. సినీ ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదగా ఈ చిత్ర టైటిల్, అలాగే ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. జెమిని సురేష్ హీరోగా రూప హీరోయిన్ గా చేయగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ గారు, నటుడు కె.వి ప్రదీప్, నటి కరాటే కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. శ్రేయాంశ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి గోపి డిఓపిగా చేయగా రాఘవేంద్ర రెడ్డి ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ : “నేను ఇతర భాషలలో కూడా సినిమాలు చేశాను. ప్రతి సినిమాకు నా వెనుక ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వ్యక్తి మా అన్నయ్య ప్రసన్న గారు. చెప్పిన బడ్జెట్ లో ఒక సినిమా చేశాను అంటే దానికి ఎంతో మంది సహకారం ఉండటం వల్లనే. అలాగే చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో నాకు ఎంతో సహాయం చేసిన వ్యక్తి రామకృష్ణ అన్నయ్య. ఈ చిత్ర నిర్మాత మా ఇంటి ఓనర్, ఆయన కుమారుడే ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. సినిమాకు డబ్బింగ్ తప్పించి మిగతా అన్ని పనులు నేను ఇంట్లోనే చేసుకుంటాను. మా పిల్లలు కూడా మంచి టెక్నీషియన్స్. దాని వల్ల నా నిర్మాతకు బడ్జెట్ తగ్గుతుంది. నా ప్రతి కథ, డైలాగ్స్ నేనే రాసుకుంటా. పోస్ట్ ప్రొడక్షన్ నేనే చేసుకుంటా. నిర్మాత ఇచ్చిన డబ్బు తీసుకున్నాను. కళామ్మ తల్లి నాకు, నా కుటుంబానికి అన్నం పెట్టింది. చాలా చిన్న స్థాయి నుండి ఇక్కడ వరకు వచ్చాను. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. సినిమాకు నటీనటులు, సంకేతాక నిపుణులు సినిమాకు బాగా సహకరించారు. ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ : “వారాహి ఎంటర్టైన్మెంట్స్ వస్తున్న ఆత్మకథ చిత్రం ఒక సామాన్యుడిది. దర్శకుడు శ్రీనివాస్ తమ పిల్లలు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉండటంతో వారి సహాయంతో నిర్మాతకు బడ్జెట్ పెరగకుండా ఈ సినిమాకు ఎంతో బడ్జెట్ తగ్గించి వేడి చేశారు. అలాగే నిర్మాత, సంగీత దర్శకుడు కూడా సొంతవారు కావడం విశేషం. రసమయి బాలకిషన్ గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషకరం. జెమిని సురేష్ మొదటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. రామక్రిష్ణ గారు చిత్ర పరిశ్రమకు చాలా సేవ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ బావుండాలని, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు కెవి ప్రదీప్ గారు మాట్లాడుతూ : “ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అందరిని కలవడం చాలా సంతోషం. నిర్మాత సోమేష్ గారితో నాకు ఎంతో కాలం నుండి మంచి అనుబంధం ఉంది. ఆయన కొడుకు ఈ సినిమాకు సంగీతం అందించడం చాలా ఆనందకరం. శ్రేయాంశ్ మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. సురేష్ తో కలిసి గతంలో పని చేశాము. ఆయన ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థియేటర్ కి వెళ్ళి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు మాట్లాడుతూ : “ఆత్మకథ చిత్ర టైటిల్ లాంచ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన చిత్ర బృందానికి నా ధన్యవాదాలు. ఎన్నో చిత్ర కార్యక్రమాలకు వచ్చాను కానీ ఈ చిత్ర టైటిల్ నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఈరోజుల్లో ఇటువంటి కథను ప్రేక్షకులకు చెప్తున్న శ్రీనివాస్ గారికి చాలా ధైర్యం. ఇటువంటి దర్శకులు దొరకడం నిర్మాతకు అదృష్టం. చిన్న వయసులో సినిమాకు సంగీతం అందించిన శ్రేయాంశ్ కు ఆల్ ది బెస్ట్. జెమిని సురేష్ మంచి నటుడు. విజయ లక్ష్మి గారు నాకు ఎంతోకాలం నుండి పరిచయం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు సమ్మెట గాంధీ గారు మాట్లాడుతూ : “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. దర్శకులు నాకు కథ చెప్పినప్పుడు ఆ కథలో ఆత్మ నేను అని చెప్పినప్పుడు సినిమాలో నేను కనిపిస్తానా అనుకున్న కాని సినిమా అంతా నా చుట్టూ తిరుగుతుంది అని సంతోషించాను. కేవలం 3 లొకేషన్స్ లో ఈ సినిమా ఇంత గొప్పగా చేయడం పెద్ద విషయం. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఈ సినిమాకు మంచి విజయం ఇచ్చి నిర్మాతకు కాలుస వర్షం కురవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ : ” అమ్మాయిల కలల రాకుమారుడు జెమినీ సురేష్ గారి కోసం నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈయనకు మంచి పాట పడితే ఆయన స్థాయి వేరేలా ఉంటుంది. ఈ రోజుల్లో నిర్మాతను బాగా చూసుకునే దర్శకులు దొరకడం చాలా కష్టం. అటువంటి దర్శకులు శ్రీనివాస్ గారు జెమిని సురేష్ కు హీరోగా మంచి అవకాశం ఇచ్చారు. ఈ వేదిక మీద ఉన్న అందరూ చాలా గొప్పవారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మిన వారాహి అమ్మవారి పేరుపై బ్యానర్ ఉండటంతో అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. సినిమాలో సంగీతం చాలా బావుంటుంది అని అనుకుంటున్నాను” అన్నారు.
నటుడు కుమనన్ మాట్లాడుతూ : “అందరికీ నమస్కారం. దర్శకులు శ్రీనివాస్ గారికి మొహంలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఒక కల ఉంటుంది, ఆ నవ్వుకి ఆర్టిస్టులు అందరూ ఒప్పేసుకుంటారు. తన కుటుంబం సభ్యులతో అలాగే నిర్మాత కుటుంబం సభ్యులతో కలిసి పనిచేస్తూ చేయించుకుని ఈ సినిమా చేసిన శ్రీనివాస్ గారికి మంచి పేరు రావాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సురేష్ ఇంకా పైకి ఎదగాలని కోరుకున్నాను, అలాగే గాంధీ గారు అంటే నాకు ఎంతో అభిమానం. మా ప్రయాణం సైరా నరసింహారెడ్డి చిత్రం నుండి ఉంది. ఆయన ఘంటసాల గారిలా పద్యాలు పడతారు. సినిమాను థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ : “సెప్టెంబర్ 7, 2005న హైదరాబాద్‌కు వచ్చి యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్రియేటివ్ డైరెక్టర్ స్థాయి నుంచి కష్టపడి ఈరోజు ‘ఆత్మకథ’ సినిమా ద్వారా ప్రధాన హీరోగా మారాను. హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్, నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాత సోమేష్, అలాగే తదుపరి చిత్రం ‘బ్లాక్ మెయిల్’ నిర్మాత అవినాష్ కూనపరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు. సమ్మెట గాంధీ, కరాటే కళ్యాణి, హీరోయిన్ రూప, డీఓపీ గోపి, ఎడిటర్ సతీష్, ‘వేదిక’ డైరెక్టర్ రాజవంశీ, స్నేహితులు హేమంత్, ప్రకాష్‌లను ధన్యవాదాలు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వెంటనే నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం రావడం పూర్తిగా శివుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా అనేది ఇంట్లో వేడి అన్నంలో తినే పప్పు, ఆవకాయ, నెయ్యి లాంటిది. ఒక ఇంట్లో జరిగే కథగా రూపొందిన ‘ఆత్మకథ’ కామన్ మ్యాన్ ఎమోషన్స్, భయం, వినోదంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం. గత 20 ఏళ్లుగా నన్ను ఆదరించిన జెమినీ కిరణ్ గారికి, సహాయకులకు, మీడియాకు పాదాభివందనాలు. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.
నటీనటులు : జెమిని సురేష్, రూప, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు తదితరులు.
