ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న మూవీ “లలిత”

ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “లలిత”. ఈ సినిమాను కాస్మిక్ పవర్ క్రియేట్స్ LLP బ్యానర్‌పై పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నందిని హీరోయిన్‌గా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా పరిచయమవుతున్నారు. “లలిత” చిత్రానికి సంగీతాన్ని మ్యూజికల్ డ్యుయో మణి, నాగరాజు అందిస్తున్నారు. నాగరాజు ప్రముఖ వేణువాదకుడు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి “కళారత్న” మరియు “వేణుగాన విశారద” పురస్కారాలు అందుకోవడం విశేషం.

“లలిత” చిత్రంలో రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తన విశ్వాసం, వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా రూపొందుతున్న ఈ సామాజిక నేపథ్య చిత్రానికి ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు…’ అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ వెల్లడించనున్నారు.

నటీనటులు – నందిని, అభిలాష్, అఖిల్ వివాన్, రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్, డీడీ శ్రీనివాస్, వి. ఝాన్సీ మేఘనా, సురేష్ దామరపల్లి, శ్రీవాణి త్రిపురనేని, జయశ్రీ రాచకొండ, మహేంద్రనాథ్, కిరణ్ కళ్యాణ్ కొండ, తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *