“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ మీ అందరూ గర్వపడేలా చేస్తుంది

సక్సెస్ ఫుల్ హీరో హీరో కిరణ్ అబ్బవరం అమోజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం చేస్తున్న వెబ్ సిరీస్ “గువ్వల చెరువు ఘాట్”. ఈ వెబ్ సిరీస్ లో తిరువీర్, సంయుక్త, తేజస్వి రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గువ్వల చెరువు ఘాట్ వెబ్ సిరీస్ ను డ్రీమ్ ఫార్మర్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ పై బాపినీడు.బి, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. డియర్ కామ్రేడ్ ఫేం డైరెక్టర్ భరత్ కమ్మ ఈ వెబ్ సిరీస్ ను ఆద్యంతం ఆసక్తికర కథా కథనాలతో తెరకెక్కిస్తున్నారు. త్వరలో “గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ వీడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీని ఆడియెన్స్ లో క్రియేట్ చేసింది.

“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ సాధించబోయో సక్సెస్ పై హీరో కిరణ్ అబ్బవరం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన తన రీసెంట్ సోషల్ మీడియా పోస్ట్ లో స్పందిస్తూ – ‘ఈ కంటెంట్ ఏ పొద్దు బయటకు వస్తదో తెలియదు కానీ వచ్చిన రోజు మాత్రం మీ అందరూ గర్వపడతారు.’ అని పేర్కొన్నారు. కిరణ్ అబ్బవరం చేసిన ఈ పోస్ట్ తో “గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *