Yashasvi Jaiswal Double Century : భారత్ కు సరైన ఎడమచేతివాటం ఓపెనర్ దొరక్క దశాబ్దం అవుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో.
మరోవైపు స్టార్ బ్యాట్స్ మెన్ల కెరీర్ ముగింపునకు వస్తోంది. ఈ దశలో భవిష్యత్ తరం బాధ్యత మోయాల్సి ఉంది.
శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితరులు తమ సత్తా నిరూపించుకున్నారు.
ఇక టెస్టు క్రికెట్ లో మరో సమర్థుడైన బ్యాట్స్ మన్ అవసరం ఉంది. అతడు కచ్చితంగా ఓపెనర్ అయి ఉండాల్సి వచ్చింది.
దీనికి సరైన జవాబుగా దొరికాడు యశస్వి జైశ్వాల్.
ముంబై అజాద్ మైదానం నుంచి..
ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో పుట్టి.. క్రికెట్ పై ప్రేమతో ముంబై మహా నగరం రావడం అంటే మామూలు మాటలు కాదు.
దానికి ఎంతో మానసిక ధైర్యం ఉండాలి. కనీసం గూడు లేని పరిస్థితుల్లో టెంట్ లో ఉంటూ ఆజాద్ మైదానంలో అడుగుపెట్టిన
అతడు ఇప్పుడు స్టేడియంలో దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్ తో విశాఖపట్టణంలో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్
అద్వితీయంగా ఆడాడు. శుక్రవారం రోజంతా క్రీజులో నిలిచిన అతడు శనివారం ఉదయం డబుల్ సెంచరీ కొట్టాడు.
209 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత్ కు 396 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
ఓపెనింగ్ లో దమ్మున్నోడు
టీమిండియాను ఎన్నాళ్లుగానో వేధిస్తున్న టెస్టు ఓపెనింగ్ సమస్యకు జైశ్వాల్ పరిష్కారం చూపాడు.
అందులోనూ అతడు ఎడమచేతివాటం బ్యాటర్ కావడం మరింత మేలు చేసింది. జైశ్వాల్ బంతిని కొట్టే తీరు కూడా చక్కగా ఉంటుంది.
కట్ షాట్లు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇక ఈ తరం కుర్రాళ్ల దూకుడైన ఆటకు అతడు ప్రతిరూపం.
దీంతోనే జైశ్వాల్ దూసుకెళ్తున్నాడు. అతిచిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన టీమిండియా క్రికెటర్ గా ఎదిగిన జైశ్వాల్..
భవిష్యత్ లో మరెన్నో రికార్డులను తిరగరాయడం ఖాయం. అయితే, అతడికి కావాల్సిన క్రమశిక్షణ. దీనిని తప్పకుండా ఉంటే
అంచనాలు అందుకోవడం ఖాయం.
Also Read:poonam panday news : బతికే ఉన్నానంటూ వీడియో షేర్ చేసిన నటి
