గద్దర్‌ అవార్డ్సు గురించి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోం: ఎఫ్‌.డి.సి చైర్మెన్‌ దిల్‌ రాజు

ఊరందరిది ఒకదారైతే ఉలిపికట్టెది మరోదారని సామెత ఉండనే ఉంది. ఇప్పుడెందుకు ఈ సామెత గుర్తుకొచ్చింది అంటే కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకాలి అని అనుకునేవారి బుర్ర ఎప్పుడెప్పుడు వెంట్రుకలు పీకాలె అని ఆలోచిస్తుంటుంది. రీసెంట్‌గా తెలంగాణా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఎంతో ఆలోచించి సినిమా వారందరూ ఆనందంగా ఉండాలి చేసిన అవార్డుల వేడుకే గద్దర్‌ అవార్డ్సు. పదేళ్లనుండి అవార్డులకు చిత్ర పరిశ్రమ నోచుకోలేదు కాబట్టి ఇప్పుడు వారందరిని అవార్డులతో గౌరవిస్తే సినిమావారంతా ఆనందంగా ఉంటారనుకుని చేసిన అవార్డ్సు అవి. ఈ అవార్డ్సు జరిగిన తీరుని చూసి చిత్ర పరిశ్రమలోని వారే కాకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. వేడుకలను ఎంతో చక్కగా నిర్వహించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారితో పాటు వేడుకలు నిర్వహించిన ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మెన్‌ దిల్‌రాజును మరియు అతని టీమ్‌ను కూడా అభినందించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే చక్కగా జరగిందనుకున్న ఈ కార్యక్రమాన్ని కూడా వంక పెట్టడానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకటానికి కొంతమంది తయారయ్యారనే సంగతి 20 రోజుల తర్వాత గద్దర్‌ అవార్డులకు వేరే రంగు పూయటానికి రెడీ అయ్యారట కొంతమంది ప్రముఖులు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి, దిల్‌ రాజు దృష్టికి లేటుగా వచ్చింది. విషయం విన్న ప్రభుత్వ పెద్దలు పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇలాంటి వార్త ఎక్కడినుండి బయటకువచ్చింది. కార్యక్రమం జరిగిన 20 రోజుల తర్వాత ఇలాంటి వార్త ఎలా పుట్టింది? అందరూ మెచ్చుకున్న కార్యక్రమాన్ని కూడా ఇలా పదిమందిలో పెట్టి కొత్త అపోహలకు దారితీస్తూ ప్రభుత్వం మీద బురదజల్లుతూ అపహాస్యం చేయలనుకుంటున్న వారు ఎవరు? అంటూ ఎఫ్‌.డి.సి మండిపడుతుంది. ఇట్లాంటి లేనిపోని వార్తలు రాసే వారందరిని ప్రభుత్వం ఓ కంట కనిపెడుతూనే ఉంది అంటున్నారు దిల్‌ రాజు మరియు ఎఫ్‌.డి.సి ప్రభుత్వ పెద్దలు. అవాస్తవాలను రాస్తూ పబ్బం గడుపుకునే వారిని ప్రభుత్వం ఎలాంటి శిక్షలు వేస్తుంది? అనేది ప్రస్తుతం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ప్రతి ఒక్కరి మెదళ్లలో ఉంది. దిల్‌ రాజు సినిమా నిర్మాతే కాదు..ప్రభుత్వం తరపున మాట్లాడే ఎఫ్‌.డి.సి చైర్మెన్‌ అనికూడా అందరూ గుర్తుంచుకుంటే మంచిదని హితవు చెప్పారట కొంతమంది మీడియా వారిని కలిసి. అలాగే అసలు మీడియా సంస్థలు ఏవి? నకిలీ మీడియా సంస్థలు ఏవో తెలుసుకోవటానికి మీడియాలోని వివిధ యూనియన్ల నాయకులను పిలిచి మాట్లాడి చర్చించి ప్రతి ఒక్కరి సమాచారాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారట దిల్‌ రాజు మరియు అతనిబృందం…
               శివమల్లాల

Also Read This : చిత్ర పరిశ్రమతో జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *