మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా పృథ్వీ పెరిచెర్ల తెరకెక్కించిన చిత్రం “స్కై”. ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “స్కై” సినిమా నుంచి ‘జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్’ లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొంది. ఈ సందర్భంగా హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ – ‘‘స్కై’ సినిమాలో నటించే అవకాశం రావడం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. మా టీమ్ అంతా మనసు పెట్టి ఈ మూవీకి వర్క్ చేశాం. వీలైనంత త్వరగా సినిమాను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం’’ అని తెలిపింది.
హీరో, నిర్మాత మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘నన్ను నేను హీరోగా కంటే ఒక నటుడిగా భావిస్తా. రీసెంట్‌గా మా మూవీ స్క్రీనింగ్ చేసినప్పుడు నా క్యారెక్టర్ ను మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేశా. నేను ఎలా నటించాను అని మా టీమ్ మెంబర్స్‌ను అడిగితే ఎంకరేజింగ్‌గా చెప్పారు. మా టీమ్‌లో రసూల్ గారి లాంటి చాలా ఎక్సిపీరియన్స్ టెక్నీషియన్ ఉండటం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది’’ అన్నారు. సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ.. ‘‘ఒక కాంపాక్ట్ బడ్జెట్‌లో పర్పెక్ట్‌గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేందుకు మా ‘స్కై’ సినిమా ఎగ్జాంపుల్. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాకు ప్రతి ఒక్కరం పనిచేశాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం’’ అన్నారు.
డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ.. ‘‘సినిమా మేకింగ్ అంటే ఏంటో, ఏ క్రాఫ్టులు కలిసి పనిచేస్తాయో అవగాహన తెచ్చుకుంటూ ఈ చిత్రానికి సన్నాహాలు చేసుకున్నాం. డైరెక్టర్‌గా నాకు ఇది డెబ్యూ మూవీ. నేను ముందు ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారిని కలిశాను. ఆ తర్వాత రసూల్ గారిని కలిశాను. సినిమా మీద ప్యాషన్‌తో మేమంతా వర్క్ చేశాం. ఇటీవల ‘స్కై’ మూవీ షో చూసి మూవీ చాలా బాగుందని అంతా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాం. మనకున్న బడ్జెట్‌లో మంచి సినిమా చేయగలం, ఆడియెన్స్‌కు ఒక సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వగలం అనే నమ్మకం కలిగింది. ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల