‘వార్ 2’ అదిరిపోయే స్కెచ్.. ఐపీఎల్‌నూ వాడేస్తోందిగా..!

కాదేదీ సినిమా ప్రమోషన్స్‌కు అనర్హం అనుకున్నారేమో కానీ ‘వార్ 2’ టీమ్ అయితే ఎప్పుడు ఎక్కడ ప్రమోషన్‌ నిర్వహిస్తే ఏక్ దమ్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా పేరు ఎలా మారుమోగుతుందో గ్రహించినట్టుంది. అందుకే అదిరిపోయే సింగిల్ షాట్ స్కెచ్ వేసింది. దీనికోసం ఐపీఎల్ 2025 ఫైనల్స్‌ను ఎంచుకుంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లోనే ‘వార్ 2’ టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనికి కావల్సిన ఏర్పాట్లన్నీ ప్రముఖ నిర్మాణ సంస్థ చేసేసినట్టుగా సమాచారం.

టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులంతా ‘వార్ 2’ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌తో అభిమానులను మరింత ఖుషీ చేయనున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ స్పెషల్ గ్లింప్స్‌ను చిత్రబృదం ప్రసారం చేయనున్నట్టు సమాచారం. యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసిందని తెలుస్తోంది. ఓవర్ బ్రేక్‌ల మధ్య హృతిక్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన వీడియోను ప్రసారం చేయనున్నట్టు సమాచారం. ఇది కానీ జరిగిందో సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కు వెళతాయనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *