ఆర్టిస్ట్‌గా ప్రతి నటుడికీ కొన్ని విభిన్నమైన పాత్రలు చేయాలనే కోరిక ఉంటుందని, తాజాగా ప్రేక్షకులు కూడా కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారని విశ్వక్ పేర్కొన్నాడు.
అదే సమయంలో, ఈ తరహా కథా శైలిలో సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు పూర్తవుతుండడంతో,
ఇప్పటి తరం హీరోగా లేడీ గెట్‌అప్ చేయడం జరగలేదని భావించి, ఆ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతో లైలా చిత్రాన్ని చేశానని చెప్పాడు.
లేడీ గెట్‌అప్‌లోకి మారడానికి ప్రతి రోజూ రెండు గంటలకు పైగా సమయం పట్టేదని,
తన టీమ్ అంతా, మేకప్ ఆర్టిస్ట్ సహా ఎక్కడా రాజీ పడకుండా శ్రద్ధ పెట్టారని, అందువల్లే లైలా పాత్ర సహజంగా కనపడిందని వివరించాడు.
చీర కట్టుకుని, హై హీల్స్ వేసుకుని యాక్షన్ సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించిందని, కానీ పాత్ర కోసం ఆ అనుభవాన్ని ఆస్వాదించానని పేర్కొన్నాడు.
సినిమా మొత్తం లైలా క్యారెక్టర్ హైలైట్ అయినా, సోనూ మోడల్ పాత్ర కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని,
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో అతని జీవనశైలిని ఎంజాయ్ చేసే సందర్బాలు మెచ్చుకోదగినవని అన్నాడు.
తన ఇంట్లో కుటుంబ సభ్యులు లైలా గెట్‌అప్ చూసి నవ్వుతుండేవారని, తన తల్లి, అక్క కూడా సరదాగా మ్యాచింగ్ చీరలు కట్టుకుని తనను మరింత ఆటపట్టించేవారని గుర్తుచేసుకున్నాడు.
ఒక కథ విన్నప్పుడు సాధారణంగా సీరియస్ మోడ్‌లో ఉంటానని, కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం పూర్తిగా నవ్వుతూనే ఉన్నానని విశ్వక్ వెల్లడించాడు.
ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
తన కెరీర్‌లో లైలా ప్రత్యేక స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని విశ్వక్ భావిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేయాలనే ఆసక్తి ఉందని వెల్లడించాడు.
సినిమా ముగింపు భాగంలో మంచి క్లిఫ్‌హ్యాంగర్ సీన్ ఉందని, ప్రేక్షకుల స్పందన బాగుంటే రెండో వారంలో అదనపు సన్నివేశాన్ని జతచేసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ చిత్రాన్ని తనకు నమ్మకంతో అప్పగించిన నిర్మాత సాహుకు విశ్వక్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా అన్ని అవసరమైన ఖర్చులు చేసినట్లు చెప్పాడు.
భవిష్యత్తులో కూడా తాము కలిసి మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆశిస్తున్నానని విశ్వక్ పేర్కొన్నాడు.
సంజు పిల్లలమర్రి
Also Read This : గూస్ బంప్స్ తెప్పిస్తున్న Kingdom టీజర్…
