...

అల్లు అర్జున్ ఇష్యూ మీద కామెంట్స్ చేసిన విజయశాంతి

అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయ రంగంలో హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన.

‘పుష్ప 2’ బెనిఫిట్ షో కి వెళ్లిన రేవతి(39) అనే మహిళా అభిమాని తొక్కిసలాటలో అక్కడికక్కడే మరణించడం చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన కారణం అని, పెద్ద ఎత్తున విమర్శలు వెతుతున్నాయి. ఆమె కొడుకు శ్రీ తేజ (9)ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఈ ఇష్యూ మీద కామెంట్స్ చేసారు విజయశాంతి

విజయశాంతి తన ట్వీట్ లో..” ఒక సినిమా విడుదలైన సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన

ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

అంతేకాదు గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్ లు అన్నీ కూడా భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.

“ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందాం” అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి.

ఇప్పుడు అలా కాకుండా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలని, ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కూడా కనిపిస్తోంది.

ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాలు అటు తెలంగాణ ఇటు ఏపీ రాష్ట్రాలలోని బీజేపీ నేతల ప్రకటనలను బట్టి మనకు అర్థమవుతుంది.

సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని,

బీజేపీ కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరం అన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి.

వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి” అంటూ తన ట్వీట్ లో పేర్కొంది విజయశాంతి.

తప్పు ఎవరిదో నిజా నిజాలు ఎటువైపు ఉన్నాయో తెలుసుకోకుండా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు అని కూడా ఆమె మండిపడినట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లు,

గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలు అగుపడుతున్నవి.

సంజు పిల్లలమర్రి

Also read this : ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్…

Aishwarya Sharma Exclusive Interview
Aishwarya Sharma Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.