విడుదల 2 రివ్యూ…

గత ఏడాది తమిళంలో ఘనవిజయం సాధించిన ‘విడుదల’ తెలుగులో కూడా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన సినిమా..

విడుదల-2. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వెట్రిమారన్ రూపొందించిన ఈ చిత్రం.. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ :

ఎన్నో ఏళ్ల నుంచి పోలీస్ వ్యవస్థను ముప్పు తిప్పలు పెడుతున్న నక్సలైట్ నాయకుడు పెరుమాళ్ అలియాస్ మాస్టారు (విజయ్ సేతుపతి).. చివరికి ఓ ఆపరేషన్లో పోలీసుల చేతికి చిక్కుతాడు.

ఈ ఆపరేషన్లో సాధారణ కానిస్టేబుల్ అయిన కుమరేశన్ (సూరి) కీలక పాత్ర పోషిస్తాడు.

మాస్టారును పోలీసుల చెర నుంచి బయటికి తీసుకురావడానికి అతడి టీం సభ్యులు ప్రణాళిక రచిస్తారు.

అదే సమయంలో అధికార వర్గాల్లో మాస్టారును కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటే..

ఎన్ కౌంటర్ చేయడానికి మరోవైపు రంగం సిద్ధం చేస్తారు. ఇదంతా ఓవైపు నడుస్తుంటే.. అసలు ఈ పెరుమాళ్ ఎవరు.. తన నేపథ్యం ఏంటి..

అతను మాస్టారుగా ఎందుకు మారాడు.. నక్సలైట్ నాయకుడిగా ఎలా ఎదిగాడు.. ఈ నేపథ్యంలో మరోవైపు ఈ కథ నడుస్తుంది.

ఆ కథేంటి.. చివరికి మాస్టారు వ్యవహారం ఏ కంచికి చేరింది అన్నదే ఈ చిత్రం.

నటీనటులు:

వెట్రిమారన్ సినిమాలంటేనే అద్భుతమైన పెర్ఫామెన్సులు చూడొచ్చు. ఇక విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడు తన సినిమాలో నటిస్తే ఇక చెప్పేదేముంది?

ఎక్కడా రవ్వంత కూడా అతి చేయకుండా పాత్రకు తగ్గట్లుగా అద్భుతంగా నటించాడు సేతుపతి.

నటిస్తున్నట్లు అనిపించకుండా పాత్రకు తగ్గట్లు బిహేవ్ చేయడంలోనే తన ప్రత్యేకత తెలుస్తుంది. మంజు వారియర్ కూడా గొప్పగా నటించింది.

సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ తనదే. సూరి మరోసారి మెప్పించాడు. ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.

రాఘవేందర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రలో చేసిన నటుడు పార్ట్-1లో మాదిరే అదరగొట్టేశాడు.

ఆముదన్ పాత్రలో చేసిన నటుడు కూడా బాగా నటించాడు. కిషోర్.. గౌతమ్ మీనన్.. మిగతా నటీనటులంతా కూడా బాగా పెర్ఫామ్ చేశారు.

విడుదల-2’లో సాంకేతిక నిపుణులందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ఇళయరాజా.. పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

చాలా ఏళ్ల తర్వాత ఆయన తన బాణీ చూపించిన చిత్రమిది. వేల్ రాజ్ ఛాయాగ్రహణం సూపర్బ్.

ఈ వింటేజ్ కథకు ఎంచుకున్న కలర్ థీమ్ ఒకేసారి మనల్ని 30-40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోతుంది.

ఒక డిఫరెంట్ మూడ్ క్రియేట్ చేసి ఈ కథను నరేట్ చేసింది వెట్రిమారన్-వేల్ రాజ్ జోడీ. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

వెట్రిమారన్ మరోసారి రచయితగా.. దర్శకుడిగా తనేంటో చూపించాడు. వామపక్ష భావజాలానికి మద్దతుగా అతను ఒక సైడ్ తీసుకోవడం మీద అభ్యంతరాలు ఉండొచ్చు కానీ..

ఈ కథను ఎంతో నిజాయితీగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. తన కథన శైలి గొప్పగా అనిపిస్తుంది.

ప్రతి సన్నివేశంలోనూ తన ముద్ర కనిపిస్తుంది. మాస్టారు బ్యాక్ స్టోరీని ఇంకా ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉండొచ్చు..

దాన్ని మినహాయిస్తే మిగతా సినిమా అంతా వెట్రిమారన్ రచయితగా-దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు

చివరగా: విడుదల-2….మంచి కంటెంట్ ఉన్న సినిమా

రేటింగ్-2.5/5

Also read this : ముఫాసా ది లయన్ కింగ్ రివ్యూ

Surya Teja Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *