విజయ్ దేవరకొండ, భాగ్యశ్ర బోర్సే జంటగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా మే 30వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
‘కింగ్‌డమ్’ను మే 30వ తేదీకే తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించామని కానీ, మన దేశంలో ఇటీవల జరిగిన ఊహించని సంఘటనల కారణంగా ప్రమోషన్స్, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి జూలై 4కి వాయిదా వేయడం జరిగిందని తెలిపింది. సమయం దొరికింది కాబట్టి ‘కింగ్‌డమ్’కి మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలుస్తామని మేకర్స్ పేర్కొన్నారు. సినిమా రాక ఆలస్యమైనా కూడా ప్రేక్షకులను ఏమాత్రం నిరుత్సాహ పరచదని అంచనాలకు తగ్గకుండా ఉంటుందని వెల్లడించారు. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకుని.. అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారని మేకర్స్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల