TS అక్షరాలను మార్చనున్న కాంగ్రెస్ సర్కారు!
Vehicle Registration Telangana: తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లపై TS అనే అక్షరాలను
మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
TS స్థానంలో TG అనే అక్షరాలు ఉండేలా చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే ప్రతిపాదనలు
సిద్ధం చేసింది. ఆదివారం సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో లాంఛనంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశముంది.
బడ్జెట్ సమావేశాల ముందు జరుగుతున్న ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మంత్రిమండలి.
పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే హామీల అమలుకి కూడా ఈ మీటింగ్ లోనే స్పష్టత రానుంది.
కాగా, వాహనాల నెంబర్ ప్లేట్లపై అక్షరాలు మార్చడం వల్ల కొత్తగా ఒనగూరే ప్రయోజనమేంటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇవి AP అవి ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఆ పేరు మిగిలిపోగా..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీఆర్ ఎస్ సర్కారు TSగా మార్చింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కొందరు తమ
ఆకాంక్షను బలంగా తెలియజేసేందుకు రాష్ట్రం ఏర్పాటు కాకముందే తమ వాహనాలపై AP స్థానంలో TG అని రాయించుకున్నారు.
అప్పట్లో దీన్ని కొందరు వ్యతిరేకించారు
కానీ, కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ స్టేట్(TS) అనే గుర్తింపు తీసుకొచ్చింది.
వాహనాల నెంబర్ ప్లేట్లపై కూడా అవే అక్షరాలు వచ్చాయి. అప్పట్లో దీన్ని కొందరు వ్యతిరేకించారు కూడా.
ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ తన మార్కు చూపించాలనే ప్రయత్నంలో ఉంది.
అందులో భాగంగా ఇప్పటికే ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చింది. మరికొన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయి.
తాజాగా TSని TGగా మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది.
వాహనాల నెంబర్ ప్లేట్లలో TS బదులు.. TG అని మార్చిచే వాహన యజమానులకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు.
ఒకవేళ ప్రభుత్వం ఉచితంగానే మార్చుతామనీ, ఆల్రెడీ వాహనాలు నడుపుతున్న వారు.. తమ వాహనాలను RTO
ఆఫీస్‌కి తీసుకెళ్తే, అక్కడ నెంబర్ ప్లేట్లను మార్చుతారని ఏదైనా ప్రకటన చేసినా, అది ప్రజలకు ఇబ్బందిగానే ఉంటుంది.
వాహన యజమానులు ఆర్టీవో ఆఫీసుల వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థి తలెత్తుతుంది. అయితే TG అని మార్చడమే మంచిదంటున్న
వారూ ఉన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికీ రాష్ట్రం పేరులోనే స్టేట్ (S) అనే అక్షరం లేని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
వాహనాలకే కాకుండా.. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశానికీ S అనే అక్షరం రాష్ట్రం పేరులో లేని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
తమిళనాడులో TN, కర్ణాటకలో KA, కేరళకు కేఎల్ మహారాష్ట్రకు ఎంహెచ్.. ఇలా ఏ రాష్ట్రం పేరులోనూ ఎస్ అన్నది లేదన్నది వాస్తవమే.
దీంతో తెలంగాణలో కూడా TG అనే అక్షరాలను కేవలం వాహనాల నెంబర్ ప్లేట్లకే పరిమితం చేస్తారా? లేక అన్ని అంశాలక వర్తింపజేస్తారా ?
అన్నది కూ డా చర్చనీయాంశంగా మారింది.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?