నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ‘తమ్ముడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ట్యాగ్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిన్నప్పుడు ఆమె స్కూల్లో ఫస్ట్ బెంచ్ అని.. కాలేజ్‌కి వచ్చే వరకూ థర్డ్ బెంచ్ అని చెప్పుకొచ్చింది. స్కూల్లో ఉండగా.. క్లాస్ మానిటర్ అని తెలిపింది. ఆ సమయంలో ఫ్రెండ్స్ పేర్లే బోర్డు మీద రాయాల్సి వచ్చేదని.. అలా చాలా మంది ఫ్రెండ్స్‌ని కోల్పోయినట్టు తెలిపింది. తాను కో-ఎడ్ స్కూల్లో చదివానని ఆ సమయంలో బాయ్స్.. తన పేరు వర్ష బొల్లమ్మ కావడంతో ‘బొల్లమ్మ’ అంటూ టీజ్ చేసేవారని చెప్పుకొచ్చింది. దానికి రివెంజ్‌గా పేర్లు రాసుకొచ్చానని వెల్లడించింది. మీరు టీజ్ చేయండి.. నేనేంటో చూపిస్తానని అలా రాసేదాన్నంటూ సరదాగా తెలిపింది. బొల్లమ్మ అనేది ఒక స్టార్ సైన్ మాదిరిగా అందరికీ ఉంటుందని తెలిపింది. తన హైట్ అనేది తనకెప్పుడూ అడ్డంకి కాలేదని తెలిపింది.
ప్రజావాణి చీదిరాల