ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తన తొలి రెమ్యూనరేషన్ రూ.2 లక్షలు తీసుకున్నానని వర్ష బొల్లమ్మ తెలిపింది. తను తొలిసారిగా స్టార్‌తో చేసింది.. విజయ్ సేతుపతితో అని వెల్లడించింది. ఆయనతో సినిమా చేయడానికి ముందు స్టార్ అంటే ఎలా ఉంటారోననే భయం ఉండేదని.. సినిమా తర్వాత ఆ భయం పోయిందని వెల్లడించింది. ‘‘నేను కారులో వెళ్లి తన ముందు బ్రేక్ వేయాలి. నేనప్పుడే కారు నేర్చుకున్నా. విజయ్ సేతుపతి సర్.. చాలా మంచి వ్యక్తి. ‘నువ్వు చెయ్యగలవు చెయ్యి’ అని చెప్పారు. ఆ రోజుతో ఒక స్టార్ అంటే ఎలా ఉంటారనే విషయమై భయం పోయిందని చెప్పుకొచ్చింది. విజయ్ సర్.. వెరీ వెరీ స్వీట్ అని తెలిపింది. ఎవరైనా ఫలానా సినిమాలోనో.. ఫలానా సీన్‌లోనో బాగా చేశారని చెబితే తనకు చాలా మోటివేషన్‌గా ఉంటుందని తెలిపింది.
ఐదేళ్ల తర్వాత వర్ష అమేజింగ్ పెర్ఫార్మర్ అని చెప్పుకోవాలనేది తన యాంబిషన్ అని చెప్పుకొచ్చింది. తమ్ముడు చిత్రంలో తనకు మంచి రోల్ దొరికిందని తెలిపింది. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పేరు చిత్ర అని తెలిపింది. జై అనే క్యారెక్టర్‌కి చిత్ర మంచి డ్రైవింగ్ ఫోర్స్ అని వెల్లడించింది. జై, చిత్రల ప్యూర్ అన్‌కండీషనల్ బాండ్ అనేది మూవీలో చాలా బాగుంటుందని తెలిపింది. నితిన్‌కి కొంచెం కూడా ఈగో లేదని పేర్కొంది. చాలా మంచి, కైండ్ పర్సన్ అని తెలిపింది. అందరితో నవ్వుతూ.. మోటివేట్ ఉంటాడని వెల్లడించింది. నితిన్‌పై చాలా కుళ్లు జోకులు వేసేదాన్నని తెలిపింది. ‘నా చుట్టూ ఉండేవారు చాలా నవ్వుతూ ఉండాలి. మా మమ్మీని కూడా నేను టీజ్ చేస్తూ ఉంటా’ అని చెప్పుకొచ్చింది.
ప్రజావాణి చీదిరాల