ప్రేక్షకులకు బిగ్ సర్‌ప్రైజ్ అండ్ షాకింగ్ గిఫ్ట్స్ ప్రకటించిన ‘వర్జిన్ బాయ్స్’

మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షు ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్‌పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు హైదరాబాద్‌లో వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ మూవీ మేకర్స్ ప్రేక్షకులు బిగ్ సర్‌ప్రైజ్ అండ్ షాకింగ్ గిఫ్ట్స్ ప్రకటించారు. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర బృందం తెలిపింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బును ప్రేక్షకులపై కురిపిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ… ‘‘యువతను మెప్పించే చిత్రం వర్జిన్ బాయ్స్. అలాగే మత్తు పదార్థాలకు ఎవరు బానిసలు కాకండి. ఎవరైనా అటువంటి చర్యలు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సహకరించాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నటి మిత్ర శర్మ మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే ఎంతో మందితో కలిసి నాకు నటించే అవకాశం ఈ సినిమాతో రావడం సంతోషంగా అనిపించింది. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. సినిమా చూసిన తర్వాత శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు’’ అని తెలిపింది. నటుడు గీతానంద్ మాట్లాడుతూ… ‘‘ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇప్పటికే నా తమ్ముడితో కలిసి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఒక సినిమా చేశాను. ఈ సినిమా యూత్ కు బయోపిక్ లాంటిది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాలలో ఉండదు. మనం ఏదైనా సాధించినప్పుడు వస్తుంది’’ అన్నారు.

నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ… ” ఈ చిత్రానికి వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ ఖచ్చితంగా సూట్ అయ్యే టైటిల్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఒక పాట ఎంతో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో పెద్దవారు ఎవరూ లేరు. అయినా ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఎన్నో సర్‌ప్రైజ్‌ లతో ఈ సినిమాతో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము” అన్నారు. దర్శకుడు దయానంద మాట్లాడుతూ… ‘‘మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. చిత్రానికి చాలా మంచి బృందం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. స్మరణ్ సాయి సంగీతం ఈ చిత్రానికి బోనస్ గా నిలుస్తుంది. మా అన్నయ్య గీతానంద్ తో నాకు ఇది రెండవ చిత్రం. అలాగే గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చింది. జూలై 11వ తేదీన ప్రేక్షకులంతా చూడవలసిన సినిమా వర్జిన్ బాయ్స్’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *