రుత్విక్ ఇక్రా ఇద్రిసి జంటగా రూపొందిన చిత్రం ‘వైభవం’. నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా నిర్మితమైన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. సాత్విక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూరత్ి చేసుకుంది. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింద. ఇటీవలే సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై మంచి స్పందనను రాబట్టాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల మద్దతు మంచి సినిమాలకు ఎప్పుడూ ఉంటుందని ఈ సినిమాతో నిరూపితమవుతుందని దర్శకుడు సాత్విక్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల