ఉత్తరం..సమీక్ష..

కాలంతోపాటు మన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకోవటం సహజం. అలాంటి మార్పులు ఇప్పుడు 40ల్లో ఉన్నవాళ్లు చాలా చూశారు. వాటిలో భాగంగానే తమ లైఫ్‌లు ట్రావెల్‌ చేశారు. ముఖ్యంగా విలువలకు వలువలు ఊడదీసే రోజులు నడుస్తున్న కాలంలో ఓ మంచి జ్ఞాపకాన్ని ‘ఉత్తరం’ రూపంలో తీసుకురావటం ‘శతమానం భవతి’ వంటి ఉత్తమ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించటం ద్వారా జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు సతీశ్‌ వేగేశ్న మెదడులో పుట్టిన ఆలోచనే ఈ ‘ఉత్తరం’కి నాంది. ముఖ్యంగా ఉత్తరం అంటే తీపి గుర్తు అనేది దర్శకుని ఆలోచన. అలాంటి తీపి గుర్తును టెక్నాలజీతో పరుగులు పెడుతున్న యువతకు ఓ సారి చూపించే ప్రయత్నంలో భాగంగా ‘కథాసుధ’ పేరుతో 30 నిమిషాల నిడివి ఉన్న కొన్ని లఘు చిత్రాలను నేటి తరానికి అందంగా ముస్తాబు చేసి ఇవ్వటానికి ఈటీవి విన్‌ వేదికగా నిలిచింది.

ఈటీవి విన్‌ తప్ప మరే ఇతర ఓటిటి ప్లాట్‌ఫాం ఇలాంటి మంచి కంటెంట్‌ను అందించటానికి పొరపాటునకూడా ఆలోచించదు. ముఖ్యంగా ఇందులో నటించిన నటీనటుల గురించి మాట్లాడుకోవాలి. నటి పూజిత పొన్నాడ ముఖ్యపాత్రలో నటించిన ఈ ఉత్తరంలో అమె రెండు రకాల పాత్రల్లో ఎంతో అందంగా కనిపించి కనువిందు చేశారనే చెప్పాలి. ప్రముఖ క్యారెక్టర్‌ నటి తులసి సూపర్‌ నానమ్మలా కనిపించారు. బాలదిత్య పూజిత భర్తగా నటించినప్పటికి ఒకటి రెండు సీన్లకే పరిమితమయ్యారు. ఆ పాత్రలో బాలాదిత్య నటించటంవల్ల పాత్రకు నిండుదనం చేకూరినట్లయింది. కొన్ని సంభాషణలు విన్నప్పుడు అవి మనకు ఎక్కడో తగులుతాయి. ఉత్తరాలతో వ్యక్తిగతంగా ముడిపడి ఉన్న ఎంతోమందికి హృదయాన్ని హత్తుకున్నా ఉత్తరం అంటే ఏంటో తెలియని వారు మాత్రం పెదవి విరిచేస్తారు. స్వయంగా ఉత్తర పరిచయం ఉన్నవారు మాత్రం తాము రాసిన ఉత్తరాలు తమకొచ్చిన ఉత్తరాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడతాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. డబ్బులు ఖర్చుపెట్టి థియేటర్లకి వెళ్లి ఇబ్బందిపడే పరిస్థితి ఏమి ఉండదు కాబట్టి మీ పిల్లలతో హాయిగా చూసి ఆ ఉత్తరంతోపాటు మీకొచ్చిన ఉత్తరాల గురించి మీ ఇంట్లో వారితో కాసేపు హాయిగా మాట్లాడుకునే చక్కని గుర్తు ఈ ‘ఉత్తరం’…..

ఉత్తరానికి ప్లస్‌లు :

నటీనటుల పనితీరు
పచ్చని పల్లెటూరి కథ

మైనస్‌లు : 

పెద్దగా ఎక్సైట్‌మెంట్‌ లేకపోవటం
రేటింగ్‌ : 2.5/5
శివమల్లాల

Also Read This : రియల్ సినిమా మ్యాన్ – వీఎన్ ఆదిత్య.

Utharam Review
Utharam Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *