‘విశ్వంభర’ కోసం ఎవరికీ తెలియని హీరోయిన్

‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కోసం సైడ్ అయిపోయింది. ఇక ఆ తరువాత సినిమా విడుదల ఊసే లేదు. అసలు ఇంకా ఎందుకోగానీ షూటింగే పూర్తవలేవు. ఇంకా స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్‌ను వెదుక్కునే పనిలోనే ఉన్నారు మేకర్స్. మొత్తానికి వెదికి చివరకు కన్నడ నటి నిష్విక నాయుడును అయితే పట్టుకున్నారు. ఈ ముద్దుగుమ్మే చిరు పక్కన స్టెప్పులేయనుందని సమాచారం. అసలు ఈ అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం తెలియదు. గతంలో ఈ ముద్దుగుమ్‘బిచ్చగాడు’ కన్నడ రీమేక్ ‘అమ్మా ఐ లవ్ యు’తో సినీరంగ ప్రవేశం చేసింది.

ఆ తరువాత ఏవో చిన్న చిన్న సినిమాలు చేసింది. అమ్మడి గురించి కన్నడ ప్రేక్షకులకే పెద్దగా తెలియదు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఏం తెలుస్తుంది. అన్నీ ఓకే అయినా కూడా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనేది చెప్పలేం. ఇక ఈ సినిమా ఈ ఏడాది విడుదలవుతుందని మాత్రం చెప్పడం కష్టంగానే ఉంది. ఎందుకంటే జూలైలో అయితే విడుదల చేసే అవకాశమే లేదు. ఎందుకంటే జూలై రావడానికి వారం రోజులే సమయం ఉంది. ఇక ఆగస్ట్ నుంచి వరుసగా పెద్ద సినిమాలున్నాయి ఆగస్ట్‌లో తారక్, రజినీకాంత్ సినిమాలు రిలీజ్ కానుండగా.. సెప్టెంబర్‌లో మిరాయ్, జోజీ.. అక్టోబర్‌లో ‘అఖండ 2, కాంతార 2’.. వంటి సినిమాలున్నాయి. డిసెంబర్‌లో ‘రాజాసాబ్’ వచ్చేస్తున్నాడు. వీటన్నింటి నడుమ ‘విశ్వంభర’ను విడుదల చేస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *