రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్ “హత్య”

ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్యా బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ఈ నెల 24న థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాను మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్,రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సోమవారం నాడు ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ థ్రిల్లర్ మూవీ రాబోతోన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

ఈ చిత్రానికి అభిరాజ్ రాజేంద్రన్ నాయర్ సినిమాటోగ్రఫర్‌గా, నరేష్ కుమారన్ పి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

అనిల్ కుమార్ పి ఈ చిత్రానికి ఎడిటర్‌గా, ఎస్‌ ప్రశాంత్‌ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

పొలిటీషియన్ హత్య ఆధారంగా తీసుకుని ఈ సినిమా చిత్రీకరించినట్లు తెలుస్తుంది.

డైరెక్టర్ శ్రీ విద్యా ఎంత వరకు ఈ స్టోరీనీ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది అనేది థియేటర్ లో చూడాలి.

సంజు పిల్లలమర్రి

Also Read This : RC 16 సినిమా స్టోరీ లో మార్పులు చేసిన చిరంజీవి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *