శ్రీవిష్ణు, కార్తీక్ రాజు కాంబోలో రూపొందిన చిత్రం ‘సింగిల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను బీభత్సంగా నిర్వహిస్తున్నారు. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో శ్రీవిష్ణు ఒక అమ్మాయి మనసుని గెలుచుకునేందుకు మూడు గోల్డెన్ టిప్స్ ఇస్తాడు.
ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. శ్రీవిష్ణు.. కేతిక శర్మను ఇష్టపడితే.. ఇవానా అతడిని ప్రేమిస్తుంది. మరి ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరి చివరకు ఏమవుతుందో సినిమా చూస్తే కానీ తెలియదు. శ్రీవిష్ణుకి వెన్నెల కిషోర్ స్నేహితుడిగా నటించాడు. వెన్నెల కిషోర్ అద్భుతమైన డైలాగ్ డెలివరీతో హ్యూమర్‌ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. కామెడీ, రొమాన్స్, లైటర్ డ్రామా బ్లెండ్‌తో ట్రైలర్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించింది. ఈ సినిమా ముఖ్యంగా సింగిల్స్‌ను ఆకట్టుకుంటుంది.