టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి డ్రగ్స్‌ను ఓ ప్రముఖ సింగర్ పుట్టిన రోజు పార్టీలో పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో గంజాయి సరఫరా అయినట్టు తెలిసింది. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ గాయని ఒకరు తాజాగా హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో చేసుకుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున విదేశీ మద్యంతో పాటు గంజాయిని సైతం సరఫరా చేయడం జరిగింది. పక్కా సమాచారంతో రిసార్ట్‌పై దాడి చేసిన పోలీసులు విదేశీ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు.
ఈ క్రమంలోనే పార్టీకి హాజరైన వారికి డ్రగ్స్ పరీక్షలను సైతం నిర్వహించారు. ఈ పరీక్షల్లో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలడంతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఫోక్ సాంగ్స్‌తో సదరు గాయని బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్లో పాటలు ఆలపిస్తూ తక్కువ టైంలోనే స్టార్ సింగర్‌గా ఎదిగింది. మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సైతం పాటలు పాడింది. మొత్తానికి గాయని పాటలతోనే కాకుండా ప్రస్తుతం డ్రగ్స్ పార్టీతో హాట్ టాపిక్‌గా మారింది.