వైభవంగా టాలీవుడ్ ఫైనాన్షియర్ కుమారుడి వివాహం.. తరలొచ్చిన సినీ ప్రముఖులు

ప్రముఖ టాలీవుడ్ ఫైనాన్షియర్ ఈ వి రాజారెడ్డి (బంగారు బాబు)రెండవ కుమారుడు క్రాంతి రెడ్డి వివాహం శిరీష రెడ్డి తో హైదరాబాద్ లోని హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అనేకమంది సినీ, రాజకీయ,వ్యాపార ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, దర్శకుడు, హరీశ్ శంకర్, సీనియర్ దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి, నటులు రాజకీయ నాయకులు విజయశాంతి, మురళీమోహన్లతో పాటు ప్రముఖ నిర్మాతలు అశ్వినీ దత్, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, చెర్రీ, సి.కళ్యాణ్, ఎం ఎల్ కుమార్ చౌదరి, బండ్ల గణేష్ , టీ జీ విశ్వప్రసాద్, అనిల్ సుంకర, నటులు రఘుబాబు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు , కెమెరా మెన్ చోటా కె నాయుడు, దాసరి అరుణకుమార్ తదితరులు పెండ్లి వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *